CM Revanth Reddy : పిల్లల ఆరోగ్యంపై బిగ్ ఫోకస్.. సీఎం కొత్త నిర్ణయం!
- అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- అంగన్వాడీ చిన్నారులకు ఇక నుంచి రెడీ టూ కుక్ ఫుడ్
- ఉప్మా, కిచిడీ మిక్స్‌ను బ్రేక్ ఫాస్ట్‌గా అందించనున్న ప్రభుత్వం
- అంగన్వాడీ కార్యకర్తలను మొబైల్ ఫోన్లు పంపిణీ చేసిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అంగన్‌వాడీ చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో “తొలి ముద్ద” అనే బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం శాసనసభ సమావేశ హాలులో లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఇకపై చిన్నారులకు ఉప్మా, కిచిడీ మిక్స్ వంటి ‘రెడీ టూ కుక్’ ఆహారాన్ని అల్పాహారంగా అందించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు విముక్తి కలిగిస్తూ, వచ్చే మూడేళ్లలో అన్ని కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని, అంగన్‌వాడీలు ఆదర్శవంతమైన వాతావరణంలో కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.
Also Read
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే అద్భుత ఫలితాలు మీ సొంతం.!
అంగన్‌వాడీల పనితీరును మెరుగుపరచడానికి , సాంకేతికతను జోడించడానికి అంగన్‌వాడీ టీచర్లకు ముఖ్యమంత్రి మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. క్షేత్రస్థాయిలో పౌష్టికాహార పంపిణీ , పిల్లల ఆరోగ్య పర్యవేక్షణలో ఈ మొబైల్ ఫోన్లు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం గురుతర బాధ్యత పెట్టిందని గుర్తుచేశారు. “ప్రభుత్వం ఎంత మంచి పథకం తెచ్చినా, అది విజయవంతం కావాల్సింది మీ చేతుల్లోనే ఉంది. ఆకలిని ఒక అమ్మగా మీరు అర్థం చేసుకుంటారని, సమస్యల పట్ల మీకు అవగాహన ఉంటుందని ప్రభుత్వం నమ్ముతోంది. ఆరు సంవత్సరాల లోపు దశ పిల్లల ఎదుగుదలకు అత్యంత కీలకమైనది. ఈ సమయంలో వారికి సరైన పోషకాహారం అందకపోతే దేశ భవిష్యత్తుకే నష్టం” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Electric Vehicles: ఎలక్ట్రిక్ వెహికిల్ కొనేవారికి భారీ శుభవార్త చెప్పిన కేంద్రం..
జబ్బులు వచ్చిన తర్వాత వేల కోట్లు ఖర్చు చేయడం కంటే, చిన్నప్పుడే పౌష్టికాహారం అందించి అనారోగ్యాలను నివారించడం మేలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అంగన్‌వాడీ సిబ్బందిని ప్రభుత్వం తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తోందని, రాష్ట్రానికి ఆర్థిక వెసులుబాటు కలిగిన వెంటనే అంగన్‌వాడీల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ధనసరి అనసూయ (సీతక్క), కొండా సురేఖ, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు, అంగన్‌వాడీ టీచర్లు , చిన్నారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!