Revanth Reddy: తెలంగాణలో ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కాంగ్రెస్ శ్రేణులకు కీలక సూచనలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: కొడంగల్‌లోని తన నివాసంలో కార్యకర్తలు, స్థానిక నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాజకీయాలు, ఓటర్ల జాబితా, ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకోవడం వల్లే జాతీయ స్థాయిలో కొడంగల్‌కు గుర్తింపు, గౌరవం లభించిందని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరుతో ఓట్లను తొలగించే కుట్రకు పాల్పడుతోందని సీఎం ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని ఓటర్ల జాబితాలో మార్పులు చేస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఇదే తరహా పరిస్థితులు కనిపించాయని, తెలంగాణలోనూ అదే విధంగా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తే పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో ఎన్నికల్లో ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించేవారని.. ఇప్పుడు ఓట్ల తొలగింపు ద్వారా పేదల ఓటు హక్కును దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం విమర్శించారు. చిన్న చిన్న తప్పిదాలను సాకుగా చూపి అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని చెప్పారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ కూడా బీజేపీకి సహకరిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. ప్రజల ఓట్లను రక్షించాల్సిన బాధ్యత ముఖ్య నాయకులపై ఉందన్నారు. గ్రామాల వారీగా బీఎల్ఏలను సమన్వయం చేసుకుని అర్హులైన పేదల ఓట్లు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మండల స్థాయి నాయకులు తమ పరిధిలో ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి నాలుగు గ్రామాలకు ఒక నాయకుడు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రతి బూత్‌లో ఒక్క అర్హుడైన ఓటు కూడా తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టేందుకు పార్టీ కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సూచించారు.
Also Read
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!
- Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
- Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!