Revanth Reddy: కేసీఆర్ ఉంటే 2వేలు పెన్షన్.. కాంగ్రెస్ వస్తే 4వేలు పెన్షన్ అని టీపీసీసీ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బలరాం నాయక్ ఎమ్మెల్యే టికెట్ ను త్యాగం చేసారని అన్నారు. బోథ్ కాంగ్రెస్ టికెట్ రాని వన్నెల అశోక్ నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. 10 ఏళ్లలో ఆదిలాబాద్, పాలమూరు ఏం మారలేదన్నారు. గూడెంలు, తండాల్లో స్కూల్ లు లేవన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో బోథ్ కు నీరు ఎందుకు రాలేదు? అని ప్రశ్నించారు. ప్రసవం కోసం నరకం చూడాల్సిన పరిస్తితి ఎందుకు వచ్చింది? అని మండిపడ్డారు. సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించడం లేదన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టినప్పటికి.. దద్దమ్మ దయాకర్ రావ్ ఖాళీ సీసాలు అమ్ముకుంటున్నారని అంటున్నారని తెలిపారు. అన్నారం అయిపోయింది.. మేడిగడ్డ కుంగిందన్నారు. ఇసుక మీద లక్ష కోట్ల పెట్టి ప్రాజెక్టు కట్టారని మండిపడ్డారు. ఇలా కడితే ఎలా? అని ప్రశ్నించారు. కేసీఅర్ అవినీతికి మెడిగడ్డ బలైందన్నారు. బోథ్ కు నీళ్ళు రాక పోవడంకు కారణం సీఎం కేసీఆర్ అన్నారు.
కుప్టి ప్రాజెక్టు పూర్తి కావాలంటే డిగ్రీ కాలేజీ రావాలంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలన్నారు.
డిసెంబర్ 31 లోపు డిగ్రీ కాలేజీ, కుప్టి ప్రాజెక్టు పనులు ప్రారంబిస్తామన్నారు. రెవెన్యూ డివిజన్ అయితాయన్నారు. 2004లో ఇచ్చిన గ్యారంటీ నిలబెట్టిన వీరవనిత సోనియా తెలంగాణ ఇచ్చిందని తెలిపారు. 6 గ్యారంటీ లను ప్రకటించడంతో సీఎం ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి అందరిని కలుస్తున్నారని అన్నారు. హోం మంత్రిని సైతం ప్రగతి భవనకు రానియ్యలేదని మండిపడ్డారు. ఎత్తి పోతల పథకంలో బిజీగా ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులను కలవనియ్యక పోయేదన్నారు. పొన్నాల లక్ష్మయ్య భాద పడుతుంటే మాత్రం ఉరికిండని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్లు అనాడు ఇచ్చామన్నారు. డబుల్ బెడ్రూం ఎవ్వరికైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం కట్టిన ఊరులో మేము ఒట్లు అడగామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఊరులో మేము ఓట్లు అడుగుతామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు హనుమాన్ గుడి లేని గ్రామం తెలంగాణలో లేదన్నారు. కేసీఅర్ ఉంటే 2వేలు పెన్షన్ కాంగ్రెస్ వస్తే 4వేల పెన్షన్ వస్తుందని తెలిపారు.
Ranbir Kapoor-Virat Kohli: చాలా మంది నటుల కంటే.. విరాట్ కోహ్లీ బెటర్: రణబీర్ కపూర్