Munugode By Election: మునుగోడు ప్రచారానికి హస్తం రె”ఢీ”.. నేటి నుంచి గడప, గడపకు కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడులో రాజకీయం రసవత్తరంగా మారిందనే చెప్పొచ్చు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇందులో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరటంతో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో కాంగ్రెస్ కు అడ్డాగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో.. కలవరం మొదలైంది. ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు ఇప్పటికే పావులు కదుపుతున్నాయి. హస్తం నుంచి కషాయం జెండా మారినా బీజేపీ నుంచి బ్రాండ్ వ్యాల్యూతో అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. దీంతో అధికార పార్టీ కూడా మునుగోడులో సత్తా చాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు, సభలతో బలప్రదర్శన చేస్తుంటే, కాంగ్రెస్ మాత్రం ఆచీతూచీ అడుగులు ముందుకు వేస్తోంది.
ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని ఒడిసిపట్టుకుని ఉనికి చాటుకోవాలనుకుంటోన్న హస్తం పార్టీ, అభ్యర్థి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. దీంతో.. ఈ విషయంలో సందిగ్థం వీడకముందే ప్రచారానికి దిగుతోంది. నేటి నుంచి హస్తం మునుగోడు ప్రచారానికి రంగం సిద్దం చేసింది. ఉప ఎన్నికల ప్రచారానికి నేటి నుంచి మొదలుకానుందని పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించింన విషయం తెలిసిందే. మునుగోడు ప్రచారానికి మండల ఇంఛార్జీలు మండలాలు వారీగా పర్యటించి ప్రచారం నిర్వహిస్తారని నేటి నుంచి గడప, గడప కాంగ్రెస్ అన్న నినాదంతో ప్రచారం నిర్వహిస్తోందని వివరించారు. మూడో తేదీన మునుగోడులో తనతో పాటు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ మీడియతో మాట్లాడతారని రేవంత్ అన్నారు. మునుగోడు ప్రచారంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొలని రేవంత్ పిలుపు నిచ్చారు.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!