Revanth Reddy: ప్రజలను పట్టించుకోకుండా పత్తా లేకుండా పోయారు.. కేటీఆర్ కు రేవంత్ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy open letter to Minister KTR: గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరం విలవిలలాడుతోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. గల్లీ ఏరైంది.. కాలనీ చెరువైంది.. రహదారి సాగరమైంది.. రోడ్లన్నీ చెరువులుగా మారిపోయాయి. బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలి లోతున నీళ్లు నిలిచాయి. లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దయనీయంగా తయారైందని అన్నారు. ఇటువంటి నేపథ్యంలో బాధ్యతయుతమైన పదవిలో ఉన్న మీరు ప్రజలను గోసను పట్టించుకోకుండా పత్తా లేకుండా పోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పుట్టిన రోజులు చేసుకుంటూ ప్రజలను మీ చావు మీరు చావండి అని వారి మానానికి వారిని వదిలేసి అని నిసిగ్గుగా బాధ్యతల నుంచి పారిపోతున్నారని అన్నారు. ఫామ్ హౌస్లో మీ అయ్య, పార్టీల్లో మీరు సేదతీరుతూ ప్రజలను వరదల్లో ముంచేశారని మండిపడ్డారు. సందర్భం వచ్చినప్పుడల్లా హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దామని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికి తండ్రి కొడుకులు పోటి పడుతుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్ ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తోందని ఉద్దెర ముచ్చట్లు చెబుతుంటారని అన్నారు. ప్రపంచ దేశాల సంగతేమో గానీ నగర ప్రజలే బయటకు రావడానికి ఒకటికి పది సార్లు ఆలోచించుకునే దుస్థితిని హైదరాబాద్ కు కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో అని ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుంటూ తిరిగాల్సిన పరిస్థితిని కల్పించారని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే మీ అసమర్థత కారణంగా హైదరాబాద్ నగరం ఎలా అభివృద్ధి చెందిందో జనాలకు అర్థమైపోయిందన్నారు. విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయిందన్నారు. హైదరాబాద్ డల్లాస్, ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ చేస్తామని ప్రగల్బాలు పలికిన తండ్రి కొడుకులు హైదరాబాద్ నగరాన్ని నరక కూపంగా మార్చారన్నారు. గత 9 ఏళ్లుగా నగరంలో సౌకర్యాల కల్పన, ప్రజలకు మేలు జరిగే దిశగా ఒక్క చర్య చేపట్టలేదని పేర్కొన్నారు. మీరు ప్రచారం చేసుకుంటున్నట్లుగా అన్ని జరిగితే ఐటీ కారిడార్ నుంచి హయత్ నగర్ దాకా ట్రాఫిక్ జామ్ లు ఎందుకు నిత్యకృత్యంగా మారుతాయన్నారు. ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు నానా యాతన పడుతున్నారని చెప్పారు. పది నిమిషాల ప్రయాణానికి రెండు గంటల సమయం పడుతుందన్నారు. రహదారుల నిర్వహణ మీకు అప్రాధాన్యత అంశంగా మారిందని తెలిపారు.
Also Read
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
Read also: RGV: పవన్ గుండెలపై రామ్ గోపాల్ వర్మ.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
ఫ్లైఓవర్ల కింద అండర్ పాస్ లు నీళ్ళు నిండిపోయి వాహనాలు వెళ్ళలేక జనాలు ఇబ్బందిపడుతున్నారని అన్నారు. కొన్ని కాలనీల్లో ఫీట్ మేర గుంతలు కనిపిస్తున్నాయని తెలిపారు. పరిస్థితి ఈ విధంగా ఉంటే స్ట్రాటజిక్ రోడ్లు అంటూ మీరు చేసే హడావుడి అంతా ఉత్తి డొల్ల అని తేలిపోయిందన్నారు. ఇటువంటి భారీ వర్షాలకే హైదరాబాద్ నగరం అతలాకుతలంగా మారుతోందన్నారు. ముంబైలో మాదిరిగా కుండపోత పడితే పరిస్థితి ఏమిటో తలుచుకుంటేనే భయపడే స్థితి దాపురించిందన్నారు. దీనికి కారణం కమీషన్లు, డబ్బు కక్కుర్తితో నిబంధనలకు విరుద్ధంగా భారీ భవనాలకు అనుమతిలవ్వడం, నాళాలు, చెరువులు కబ్జా అంటూ ఆరోపించారు. హైదరాబాద్ పరిధిలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు యథేచ్ఛగా భూములు, చెరువులు కబ్జా చేస్తూ అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన మీరు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని తెలిపారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం అనే స్లోగన్ మీ పార్టీకి చెందిన నాయకుల అక్రమ నిర్మాణాల విషయానికి వచ్చే సరికి ఉత్తుత్తి పాదంగా మారిపోతుందన్నారు.
హైదరాబాద్ లో ఇటువంటి పరిస్థితి రాబోతుందన్నారు. నగరం కాంక్రీట్ జంగిల్ గా మారబోతుందనే విషయాన్ని కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర భారీ నిర్మాణాల మాటున దాగి ఉన్న అవినీతిని వెల్లడించే సమయంలో పత్రికాముఖంగా ప్రస్తావించానని గుర్తుచేశారు. భారీ నిర్మాణాలకు అనుమతిలిస్తూ కాసుల వేట కోసం మీరు సాగిస్తున్న ఆటలో హైదరాబాద్, ఇక్కడి ప్రజలు బలి కాబోతున్నారని హెచ్చరించానని తెలిపారు. అయిన పట్టించుకోకుండా దున్నపోతు మీద వాన పడినట్లుగా మీ వ్యవహారం ఉందని మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో ఇంత విధ్వంసం జరుగుతుంటే కనీసం సమీక్ష చేసే సమయం మీకు లేదన్నారు. వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలెర్ట్ ప్రకటించిందని, అయిన కూడా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ప్రజల సహాయం కోసం హాహాకారాలు చేస్తున్న పట్టించుకునే తీరిక లేదన్నారు. రోజు కూలీకి వెళ్తే తప్ప పూట గడవని వారి స్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. వారి ఆర్తనాదాలను పట్టించుకునే సమయం మీకు లేదా? అంటూ ప్రశ్నించారు.
నా కడుపు నిండితే చాలు అన్నట్లుగా మీ వ్యవహరం సాగుతోంది. కనీసం అధికారులకు అయిన ఆదేశాలివ్వాలి అనే ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవరిస్తున్న మిమ్మల్ని ఏ విధంగా శిక్షించిన పాపం లేదు. గతంలో వరదల సమయంలో మీడియా ముందుకు వచ్చి మీరు చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్ ను ఉద్దరిస్తామంటూ ప్రజలను ప్రకటనల ద్వారా మభ్య పెట్టడం మినహా మీరు చేసింది శూన్యం. అప్పట్లో ప్రకటించిన పది వేల సాయం ఎన్నికల పథకంగా మిగిలిపోయింది. మీ చేతగానితనంతో గత కొంతకాలంగా హైదరాబాద్ పరిస్థితి నానాటికి దిగజారుతోంది. మునుపు ముంపెన్నడూ లేని కొత్త ప్రాంతాల్లో ప్రజలు వరద తిప్పలు ఎదుర్కొంటున్నారు. 2020 నుంచి పరిశీలిస్తే వరద, ముంపు ప్రాంతాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి కారణం ఎవరూ అని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకున్నా పాపాన పోలేదు. ఇప్పటికైనా మీదైనా కలల ప్రపంచం నుంచి బయటికి వచ్చి ప్రజల కష్టాలను తీర్చే ప్రయత్నం చేయండని తెలిపారు. లేకపోతే శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమరుల స్థూపం ర్యాలీగా వెళ్లి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. మీ చేతగాని తనాన్ని ఎండగట్టి తగిన బుద్ధి చెబుతామని మండిపడ్డారు.
RGV: పవన్ గుండెలపై రామ్ గోపాల్ వర్మ.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!