CM Revanth Reddy : నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!
- కొడంగల్‌లో సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు
- రూ.110 కోట్లతో ఆలయ పునర్నిర్మాణ పనులు
- 430 పడకల ఆసుపత్రికి సీఎం శంకుస్థాపన
- అభివృద్ధి సభతో కొడంగల్‌లో రాజకీయ సందడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్‌రెడ్డి శుక్రవారం తన స్వంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ వందల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక, ఆరోగ్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడా) ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి వెల్లడించారు.
సీఎం పర్యటనలో ప్రధానంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత లభించనుంది. కొడంగల్‌లోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి భూమిపూజ నిర్వహించనున్నారు. ఈ ఆలయాన్ని దాదాపు రూ.110 కోట్ల భారీ వ్యయంతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దనున్నారు. దీనితో పాటు కోస్గిలోని వేణుగోపాలస్వామి ఆలయానికి రూ.2 కోట్లు, దౌల్తాబాద్‌లోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ పనుల కోసం రూ.2.14 కోట్లు వెచ్చించి పునర్నిర్మాణ పనులను సీఎం ప్రారంభించనున్నారు. నియోజకవర్గంలోని పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిధులు కేటాయించారు.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కొడంగల్‌లో సుమారు రూ.250 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 430 పడకల భారీ ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ అత్యాధునిక ఆసుపత్రి అందుబాటులోకి వస్తే స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్యం స్థానికంగానే లభించనుంది. నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన మెరుగైన వైద్య సదుపాయాల దిశగా ఇది ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు.
అభివృద్ధి పనుల ప్రారంభం అనంతరం ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సభకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సభ విజయవంతం కోసం ప్రత్యేక కార్యదర్శి శ్రీనివాసరాజు, దేవాదాయ కమిషనర్ హనుమంతరావు, సమాచార శాఖ కమిషనర్ ముకుందరెడ్డి , జిల్లా కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి ‘కడా’ అధికారి వెంకట్‌రెడ్డి పనులను స్వయంగా పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు భారీగా జనసమీకరణకు పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!