Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Revanth Reddy Is Serious About Arresting Congress Leaders

Revanth Reddy: కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపలేరు

Published Date :June 22, 2023 , 12:07 pm
By NTV WebDesk
Revanth Reddy: కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపలేరు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Revanth Reddy: రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల అరెస్ట్‌లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల అరెస్టులు అప్రజాస్వామికమన్నారు. కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపలేరు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ దశాబ్ది ఉత్సవాల పేరుతో పార్టీ ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియాగం చేస్తున్న విషయం వాస్తవం కాదా? అని, ఇది ఖచ్చితంగా దశాబ్ది దగా నే అంటూ వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక హామీ అయినా పూర్తిగా అమలు చేసారా? అని నిలదీశారు. సీఎం కేసీఆర్ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిన హామీలనే తాము ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడే హక్కు ఉందన్నారు. కాంగ్రెస్‌ నాయకులను ముందస్తు అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇలా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపలేరన్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Read also: Andhra Pradesh: సినిమాను మించిన క్రైమ్ స్టోరీ..చాలెంజ్ చేసి పగ తీర్చుకుంది..

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది దగా పేరుతో కార్యక్రమాలు చేపట్టడంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతలను నిరసనలు చేపట్టకుండా అడ్డుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు పోలీసులు. మాజీ ఎల్.ఓ.పి. షబ్బీర్ అలీని హైదరాబాద్ లో ఆయన నివాసంలో బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎల్బీనగర్ నియోజక వర్గంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో దశాబ్ది దగా కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా వస్తుండగా ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేయడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కాగా.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు నిరసన చేస్తున్న కాంగ్రెస్‌ నేతలను అదుపులో తీసుకున్నారు.
Nikhil: వారం రోజుల్లో సినిమా రిలీజ్… ప్రమోషన్స్ మాత్రం చాలా వీక్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • arresting Congress leaders
  • BRS
  • cm kcr
  • Congress leaders
  • revanth reddy

తాజావార్తలు

  • JD Vance: చర్చలు విఫలం.. ఇరాన్ తో ఎలాంటి డీల్ లేదన్న జేడీ వాన్స్

  • Shashi Tharoor: వారే ఆ పాత్రను పోషించగలరు.. పాక్ ప్రధాని పోస్ట్‌పై థరూర్ సెటైర్స్

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions