Revanth Reddy: నవంబర్ 30 న అల్లుడు హరీష్ కు.. మామ కేసీఆర్ కు బుద్ది చెప్పాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతుబంధు రైతుల ఖాతాలో వేయాలని ఈసీ కి మేం విజ్ఞప్తి చేసామన్నారు. రైతుల ఖాతాల్లో పడాల్సిన రూ.5వేల కోట్లు ఆగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా… రైతు బంధు రాకపోవడానికి కారణమైన బీఆర్ఎస్ నేతలను తరిమికొట్టాలని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కుట్ర వల్లే రైతుల ఖాతాలో పడాల్సిన నిధులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లుడు హరీష్ వల్లే రూ.5వేల కోట్లు ఆగిపోయినాయ్… దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు. నవంబర్ 30 న అల్లుడు హరీష్ కు.. మామ కేసీఆర్ కు బుద్ది చెప్పాలన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు ఏటా ప్రతీ ఎకరాకు రూ.15వేలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ది అని స్పష్టం చేశారు.
Read also: Minister KTR: కాంగ్రెస్ ఏమైనా కొత్త పార్టీనా చెత్తపార్టీ.. 55 ఏండ్లు మనల్ని చావగొట్టిన పార్టీ…
తెలంగాణలో రైతు బంధు విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన పర్మిషన్ ను రద్దుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించిన విషయం తెలసిందే. రైతు బంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశ్యం మామా – అల్లుళ్లకు లేదని ఆయన విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఎన్నికల కమిసన్ ఉపసంహరించుకుంటున్నట్టు ఆదేశాలు ఇవ్వడమే దీనికి నిదర్శనం అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దు.. పది రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 15 వేల రూపాయల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
MLA Laxmareddy: కేసీఆర్ అంటే చేతల మనిషి… ఎన్నికల ప్రచారంలో లక్ష్మారెడ్డి