Revanth Reddy : చూసుకొని మురవాలి…చెప్పుకొని ఏడ్వాలి.. కవితకు కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ నేడు, రేపు తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే.. అయితే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటనపై విమర్శరాస్త్రాలు సంధించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దీంతో.. తనదైన స్టైల్లో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ట్విట్ కౌంటర్ ఇచ్చారు. ‘శ్రీమతి కవిత గారూ…. రాహుల్ గాంధీని ప్రశ్నించే ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. మోదీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు.. మీరు ఎక్కడ ఉన్నారు? మీ తండ్రి మోడీ ముందు మోకరిల్లి తెలంగాణ నుండి ఇక పై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ ఇచ్చి రైతులకు ఉరితాళ్లు బిగించినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? వరి వేస్తే ఉరే అని మీ తండ్రి ప్రవచనాలు చెప్పి ఆయన ఫాంహౌస్ లో 150 ఎకరాలలో వరిపంట వేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిర్చీ రైతులు పిట్టల్లా రాలిపోతుంటే మీరు ఎక్కడ ఉన్నారు?” అని ట్విట్టస్త్రాలు సంధించారు.
అంతేకాకుండా.. “రైతుకు రూ. లక్ష రుణమాఫీ చేస్తానని మీ తండ్రి పచ్చి మోసానికి ఒడిగడితే ప్రశ్నించాల్సిన మరెక్కడ ఉన్నారు? రాష్ట్రంలో రైతులకు అవసరమైన 26 లక్షల టన్నుల ఎరువులు ఫ్రీగా ఇస్తానని మీ తండ్రి చెప్పి ఐదేళ్లవుతున్నా అర క్వింటాల్ ఎరువులు కూడా ఇవ్వలేదు…మరి మీరెక్కడ ఉన్నారు? అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యపురాసులు తడిచి రైతులు బోరున విలపిస్తున్నారు… వారి కష్టం పట్టించుకోకుండా మీరెక్కడ ఉన్నారు? ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీతో కలిసి డ్రామాలాడి ఆలస్యం చేయడం వల్ల చాలా మంది రైతులు ఇప్పటికే మద్దతు ధర కంటే చాలా తక్కువగా రూ.1400 లోపే అమ్ముకుంటున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు?” అంటూ రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ ఇచ్చారు.
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్‌లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ..
- OTR : మంత్రి శ్రీధర్‌బాబుతో ఎంపీ వంశీకి సెట్ అయిందా?
తాజావార్తలు
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..