ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నీరులేక మోడువారిపోతే ఆ రైతన్న మనోవేధన వర్ణానాతీతం. అయితే నిన్న రాష్ట్రంలో పలు చోట్ల వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తెలంగాణలో రోజురోజు విద్యుత్ వినియోగం పెరుగుతూ వస్తోంది. అంతేకాకుండా వ్యవసాయ రంగానికి కావాల్సినంత త్రీఫేజ్ విద్యుత్ అందుబాటులో లేదనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్ కోతలు రైతులకు గుండెకోతను మిగుల్చుతున్నాయని ఆయన అభివర్ణించారు. కేసీఆర్ తప్పుడు విధానాలతో విద్యుత్ వ్యవస్థను గుల్లచేసి పారేశాడని ఆయన ఆరోపించారు.
కొనుగోళ్లలో ఆయనకు కమీషన్లు…విద్యుత్ వ్యవస్థలకు అప్పులు మిగిలాయని, ఏది ఏమైనా పంటలకు చివరి తడి పూర్తయ్యే వరకు నిర్విరామ విద్యుత్ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. ట్రాన్స్ కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. నిన్న కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, దీనిపై ఎన్‌పీడీసీఎల్ సంస్థలో నిన్న కొంత సమాచార లోపం కారణంగా వ్యవసాయ రంగం ఇబ్బందులు ఎదుర్కున్నారన్నారు. దీంతోపాటు ఎప్పటిలాగే ఇప్పుడూ కూడా 24 గంటలపాటు నిరంతరాయం విద్యుత్ సరఫరా ఉంటుందని, రైతులు ఆందోళన చెందాల్సినవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
Ramadan Special : వారెవ్వా.. హైదరాబాద్‌లో మొదటి డబుల్ డెక్కర్ హలీమ్