ముస్లింలకు ఎంత పవిత్రమైన మాసం రంజాన్ నెల. ఈ రంజాన్ మాసంలో ఎంతో భక్తిశ్రద్దలతో అల్లాహ్‌ను ప్రార్థిస్తుంటారు. అయితే రంజాన్ వచ్చిదంటే చాలు.. పట్టణాల నుంచి గ్రామాల వరకు వివిధ రకాల వంటకాలు దర్శనమిస్తుంటుయి. ఇది హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. పత్తర్‌కా ఘోష్ లాంటి ఎన్నో అరుదైన వంటకాలను ఈ రంజాన్ మాసంలో టేస్ట్ చేయవచ్చు. అయితే రంజాన్ నెలలో కేవలం ముస్లింలే కాకుండా మాంసాహార ప్రియులందరూ ఈ వంటకాలను ఆస్వాదిస్తుంటారు. ఎన్ని వంటకాలు అందుబాటులో ఉన్నా.. కింగ్ ప్లేస్ మాత్రం హలీమ్ దే.. రంజాన్ మాసంలో హలీమ్ తినని మాంసాహార ప్రియులండరూ అనడంలో అతిశయోక్తి లేదు.
అంత ఫేమస్ కాబట్టి అడుగడుగా హైదరాబాద్‌లో హలీమ్ స్టాల్స్ వేలిశాయి. ఈ క్రమంలో కస్టమర్స్‌ను తమవైపు తిప్పుకోవడానికి ప్రముఖ రెస్టారెంట్‌లు కొత్తకొత్త ఆలోచనలను ముందుకు తీసుకువస్తున్నాయి. మొన్నటికి మొన్న ‘బాహుబలి హాలీమ్’ పేరుతో సికింద్రాబాద్, కార్ఖానాలోని గ్రిల్-9 రెస్టారెంట్ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. అయితే ఇప్పుడు నిజాంస్ ప్రైడ్ కూడా కొత్త ఆలోచనతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. నిజాంస్ ప్రైడ్ హైదరాబాద్‌లో మొట్టమొదటి డబుల్ డెక్కర్ హలీమ్‌ను పరిచయం చేసింది. దీని ప్రత్యేకత ఏమిటంటే డిష్‌ను ప్రదర్శించిన విధానం. ఈ డిష్‌లో హలీమ్‌ను కోక్‌తో వడ్డిస్తారు.
డబుల్ డెక్కర్ బస్సులో రెండు కంపార్ట్‌మెంట్లు ఎలా ఉంటాయో, హలీమ్ మరియు కోక్ ఒకదానిపై ఒకటి వడ్డిస్తారు. కోక్‌తో నిండిన గ్లాస్ దిగువ భాగంలో, దాని పైభాగంలో ఒక కప్పు నిండుగా హలీమ్‌ను నింపుతారు. ఈ మటన్ డబుల్ డెక్కర్ హలీమ్ సింగిల్ సర్వింగ్ ధర రూ. 230. నిజాంస్ ప్రైడ్ యొక్క నాలుగు అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం కేపీహెచ్‌బీ కాలనీ (సాయంత్రం 4 నుండి 11:30 వరకు), అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ (మధ్యాహ్నం 2 నుండి రాత్రి 10:30 వరకు), కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ (సాయంత్రం 2 నుండి రాత్రి 10:30 వరకు), పంజాగుట్ట – నెక్ట్స్ గల్లెరియా మాల్ (మధ్యాహ్నం 2 నుండి రాత్రి 10:30 వరకు) వద్ద మనం రుచికరమైన డబుల్ డెక్కర్ హలీమ్‌ను ఆస్వాదించవచ్చు. హలీమ్ మాత్రమే కాకుండా, నిజాంస్ ప్రైడ్ ప్రత్యేకంగా హైదరాబాదీ వంటకాలను కొంచెం ఇరానియన్ టచ్‌తో అందిస్తుంది. ఇరానీ చాయ్, హైదరాబాదీ దమ్ బిర్యానీ, షావర్మా మరియు కబాబ్స్ ఇతర ప్రముఖ వంటకాలు ఇక్కడ దొరుకుతాయి.