NTV Telugu Site icon

నిజాం..ఖాసీం రిజ్వీ లాంటి కేసీఆర్‌..హరీష్‌కు బుద్ధి చెప్పాలి: రేవంత్‌ రెడ్డి

హుజురాబాద్‌ బైపోల్‌లో ప్రత్యర్థుల మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు మద్దతుగా ప్రచారంలో కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యర్థి పార్టీల నాయకులపై తీవ్రమైన మాటల దాడి చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ నిజాం నవాబు… అధిపత్యం కోసం రజాకార్ల ను నియమించుకున్నారు . కేసీఆర్‌ నిజాం అయితే..ఖాసీం రిజ్వి హరీష్ రావు తన పెత్తనం నిలబెట్టుకోవడానికి నిజాం లాంటి కేసీఆర్‌…హరీష్ రావు ను ఖాసిం రజ్వీ లెక్క మార్చేశారు. హుజురాబాద్ లో వ్యాపారులను, నిరుద్యోగులను, ఫీల్డ్ అసిస్టెంట్లను హరీష్‌రావు బెదిరిస్తున్నారన్నారు. చిల్లర రాజకీయాలకు తెర లేపి..ఖాసిం రీజ్వినీ తలపిస్తున్నడు హరీష్‌రావు అని రేవంత్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పోలీస్‌ శాఖలో స్పిట్‌ వచ్చిందని, పోలీసు శాఖ రెండుగా చీలిపోయింది రాష్ట్ర డీజీపీ ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది. ప్రభాకర్ రావుకి ప్రభుత్వం అప్పగించిన రెండు పనుల్లో రేవంత్… డీజీపీ ఫోన్ ట్యాప్ చేయడమే ఆయన పని అని రేవంత్‌ అన్నారు. రిటైర్డ్ అయినా DSP వేణు గోపాల్ రావు..వద్ద 32 మందితో నిఘా పెట్టారు. డీజీపీ మీద నర్సింగ్ రావుని నిఘా పెట్టారు డీజీపీ కూడా భయం భయం గా బతుకుతున్నారు .IPS లో ఓ సామాజిక వర్గం నీ దొంగలా చూస్తున్నారు. ఆ సామాజిక వర్గం IPS లు… మాకు పోస్టింగులు వద్దు అనే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి నిఘా లేదు. రిటైర్డ్ అయిన కొందర్ని స్వంతంగా పెట్టి వ్యవస్థలను నడిపిస్తున్నారు. సిటీ చుట్టూ ముట్టు తన వారికే పోస్టింగులు వేశారు. పోలీసు శాఖ లో రెండు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం ఉంది ఏపీకి చెందిన కేసీఆర్‌ బంధువునీ డిప్యూ టేషన్‌ మీద తెప్పించి అవసరం ఉందా..? అని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

హుజూరాబాద్ ఎన్నికల ప్రచారానికి రేవంత్ రాలేదు అని టీఆర్ఎస్ అంటుందని
మరి కేసీఆర్‌ ఏం చేస్తున్నారు డ్రగ్స్..సుగంధాల పై సమీక్షలు, ఇక కేటీఆర్… ప్లీనరీ పేరుతో వంటకాలు చేస్తున్నారు. కవితమ్మ…బెంజ్ కారు..బతుకమ్మతో బూర్జ్ ఖలీఫా మీద బతుకమ్మ ఆట- పాట, ఖాసీం రిజ్వీకి ఇక్కడ ఎదురు వచ్చినోడి నాలుకలు కోస్తున్నరు. నలుగురు నాలుగు తీర్లు ఉన్నారు.ప్రజల కోసం ఎప్పుడైనా కోట్లాడేది కేవలం కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటేనని తెలంగాణ బాగోగులు బాధ్యత మాది ఎందుకంటే…తెలంగాణ ఇచ్చింది మేము అని రేవంత్‌రెడ్డి అన్నారు.