గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలంగా మారింది. పలు జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాజెక్ట్ లలో భారీగా వరదనీరు చేరడంతో.. పలు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. అయితే జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామెజీపేట- భూపతిపూర్ గ్రామాల వాగు భారీ వర్షాలకు పొంగిపొర్లుతుంది. మూడురోజుల క్రింతం షిప్ట్ డిజైర్ కారు వాగులో కొట్టుకుపోయింది. ఈ కారులో న్యూస్ కవరేజ్‌కు వెళ్ళిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ వున్నారు. ఈన్యూస్ కవరేజ్ చేసేందుకు వెళ్ళిన జమీర్, కుటుంబ సభ్యుల నుంచి ఓ వార్త రావడంతో.. వెనుతిరిగాడు జమీర్. అయితే ఈ క్రమంలో.. రామోజీపేట వాగు మీదుగా కారులో వస్తుండగా నీటి ప్రవాహం ఎక్కువైంది.
read also: Ts Si Prelims Exam Postponed: ఎస్‌ఐ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా..!
వరద ధాటికి జమీర్ ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. దీంతో.. మంగళవారం రాత్రి నుండి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినా కారు ఆచూకి లభ్యం కాలేదు. అయితే ఎట్టకేలకు జమీర్ ఆచూకి లభ్యమైంది. శుక్రవారం ఉదయం కారుతో సహా జమీర్‌ను బయటకు తీసారు అధికారులు. చెట్టు కొమ్మకు జమీర్ మృతదేహం కనిపించడంతో.. ప్రాణాలు తెగించి రెస్క్యూటీం జమీర్ మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. జమీర్ మృతితో కుటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి. భారీ వర్షానికి కూడా లెక్కచేయకుండా ప్రాణాలు తెగించి జమీర్ చేసిన సాహసించాడు. కానీ.. వరద ప్రవాహం ఎక్కువకావడంతో.. కారుతో సహా జమీర్ కొట్టుకు పోయి.. మృత్యువాత పడటంతో తీవ్ర విషాదం నింపింది.