Renuka Chowdhury: బాధితుల్ని పరామర్శించడానికి వెళ్తే.. అక్రమ కేసులు బనాయించడం దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Renuka Chowdhury On Khammam Gas Cylinder Incident: ఖమ్మం జిల్లాలోని చీమలపాడులో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం (గ్యాస్ సంఘటన) ఘటనలో గాయపడిన వారిని, కుటుంబ సభ్యుల్ని మాజీ మంత్రి రేణుక చౌదరి తాజాగా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ సంఘటన బాధాకరమని, అమాయకులు బలి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించడానికి వెళ్తే.. పోలీసులు అధికార మదంతో వ్యవహరించారని మండిపడ్డారు. ఇలాంటి సమయంలోనే 144 సెక్షన్‌తో పాటు ఎక్కడా లేని చట్టాలు గుర్తుకొస్తాయని, అక్రమ కేసులు బనాయించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన సందీప్‌ని హుటాహుటిన హాస్పిటల్ నుంచి తరలించి, దహన సంస్కారాలు చేయడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనని ప్రభుత్వ అధికారులు తప్పుదోవ పట్టించి, అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంతో పాటు వారి పిల్లలకు ఉచితంగా చదువును కల్పించాలని డిమాండ్ చేశారు.
Mallu Ravi: కేసీఆర్ దళిత వ్యతిరేకి.. మల్లు రవి ధ్వజం
Also Read
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్‌బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
లోకల్ మంత్రి ఎందుకు పనికిరారని.. బీఆర్ఎస్ నాయకుల రాజకీయాలకు పేదవారు బలి అవుతున్నారని రేణుక చౌదరి వ్యాఖ్యానించారు. నిమ్స్‌లో నలుగురు చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అన్నారు. నలుగురికి చేతులకు, కాళ్లకు గాయాలవ్వగా.. ఒకరికి ఇన్ఫెక్షన్ రావడంతో కాలు తీసేశారన్నారు. సందీప్ అనే వ్యక్తి చనిపోతే.. దొంగచాటుగా తరలించి అంత్య క్రియలు చేశారని, అతనికి ఒక భార్యతో పాటు కొడుకు ఉన్నాడని తెలిపారు. ఆమెను కూడా ఇక్కడి నుంచి తరలించారని, ఇప్పుడు ఆమె ఆచూకీ కనిపించడం లేదని పేర్కొన్నారు. ఆమెకు రావాల్సిన నష్టపరిహారం కొట్టేయాలని అధికారులు చూస్తున్నారని, ఆమెకు న్యాయం జరగాలని కోరారు. ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు తనని అడుగడుగునా అడ్డుకున్నారన్నారు. బాధితులకు రూ.50 లక్షల నష్టపరిహారంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బాధిత కుటుంబంలోకి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, పోడు భూముల్లో 3 ఎకరాలు ఇవ్వాలని చెప్పారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానన్నారు.
Ponguleti Srinivasa Reddy: రాబోయే ఎన్నికల్లో ఏ ఒక్కరినీ అసెంబ్లీ గేటు తాకనివ్వను
ఇదిలావుండగా.. ఖమ్మం జిల్లా కారేపల్లిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయగా, దీనికి కొద్ది దూరంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా.. దాదాపు 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. మరణించిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరపున రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు సైతం వ్యక్తిగతంగా రూ. 2 లక్షలు, గాయాలైన వారికి రూ. 50 వేలు ప్రకటించారు.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?