Warangal: మిర్చికి ఆల్‌టైం రికార్డు ధర.. క్వింటాల్‌కు రూ.44వేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది మిర్చి రైతులకు కలిసివచ్చింది. దీంతో రైతులకు మద్దతు ధరకు మించిన ధరలు లభిస్తున్నాయి. అంతేకాకుండా మిర్చి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తాజాగా వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్లో క్వింటాల్ దేశీయ రకం మిర్చి ధర ఏకంగా రూ.44వేలు పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన రైతు నాగేశ్వరరావు తీసుకువచ్చిన మిర్చిని జితిన్ ట్రేడింగ్ కంపెనీ క్వింటాల్‌కు రూ. 44 వేలు చెల్లించి కొనుగోలు చేసింది. కొద్ది రోజుల క్రితం మిర్చి క్వింటాల్ ధర రూ.37 వేలు పలికింది.
మరోవైపు సింగిల్ పట్టీ రకం మిర్చి కూడా రికార్డు స్థాయిలో క్వింటాల్ ధర రూ.42,500 పలికింది. మిర్చి పంటకు తెగులు సోకడం, దిగుబడి తగ్గిపోవడంతో పాటుగా అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతోనే ఈ తరహాలో రికార్డు స్థాయి ధరలు నమోదయ్యాయని ఎనుమాముల మార్కెట్ అధికారులు చెబుతున్నారు. అటు పత్తి పంటకు కూడా రికార్డు ధర లభిస్తోంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర రూ.10,500 పలికింది.
Also Read
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!