ఈ ఏడాది మిర్చి రైతులకు కలిసివచ్చింది. దీంతో రైతులకు మద్దతు ధరకు మించిన ధరలు లభిస్తున్నాయి. అంతేకాకుండా మిర్చి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తాజాగా వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్లో క్వింటాల్ దేశీయ రకం మిర్చి ధర ఏకంగా రూ.44వేలు పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన రైతు నాగేశ్వరరావు తీసుకువచ్చిన మిర్చిని జితిన్ ట్రేడింగ్ కంపెనీ క్వింటాల్‌కు రూ. 44 వేలు చెల్లించి కొనుగోలు చేసింది. కొద్ది రోజుల…