Firing in Madhapur : భాగ్యనగరంలో కాల్పుల కలకలం..ఒకరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాదాలో కాల్పుల కలకలం రేపింది. ఈ కాల్పుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యాయి.. ఈ ఘటన నగరంలోని మాధాపూర్ పోలీస్టేషన్ పరిధిలోని నీరూప్ వద్ద సోమవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇస్మాయిల్ అనే వ్యక్తిని సోమవారం తెల్లవారు మూడు గంటల సమయంలో ముజీబ్ అనే వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సమాచారంతో పోలీసులు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించి బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు. మృతుడు కాలాపత్తర్ కు చెందిన రౌడీషీటర్ ఇస్మాయిల్ గా గుర్తించారు. ఇస్మాయిల్ పై కాల్పులు జరిపింది ముజాహిద్ గా గుర్తించారు.
read also: Laal Singh Chaddha: కొత్త చిక్కుల్లో సినిమా.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్
Also Read
అయితే కాల్పులు జరిపిన నిందితులు బైక్ పై వచ్చి కారులో ఉన్న ఇస్మాయిల్ పై పాయింట్ బ్లాంక్ లో ఆరు రౌండ్ల కాల్పులు జరిపారని పోలీసులు పేర్కొన్నారు. నిందితున్ని పట్టుకునేందుకు గాలించర్చలు చేపట్టారు. నీరూప్ వద్ద (సంఘటనా స్థలం)లో క్లూస్ టీంతో పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. కాల్పులకు గల కారణం రియల్ ఎస్టేట్ వివాదాలే అని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతి చెంఇన ఇస్మాయిల్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గాయాలైన మరొక వ్యక్తిని వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే.. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
-
Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్‌కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
-
Ranabaali : పెళ్లి వల్ల రణబాలి వాయిదా?
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్‌కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!