రియల్ కింగ్ ”హైదరాబాద్”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా నగరం హైదరాబాద్ విస్తరిస్తూనే ఉంది… ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో భారీ స్థాయిలో కొత్త వెంచర్లు వస్తూనే ఉన్నాయి.. ప్లాట్లు, ఇళ్లు ఇలా రెగ్యులర్‌గా క్రయ విక్రయాలు సాగుతూనే ఉన్నాయి.. ప్రతిష్టాత్మక సంస్థలు రంగంలోకి దిగి విల్లాలు, అపార్ట్‌మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్‌లు.. ఇలా అనేక రకాలుగా బిజినెస్ చేస్తున్నాయి.. కొన్ని చోట్ల ఇప్పటికే ఓఆర్ఆర్‌ను దాటేసి రియల్ ఎస్టేట్ జోరుగా సాగుతోంది… రీజనల్ రింగ్ రోడ్డు కూడా రానుండడంతో.. దానిని దృష్టిలో పెట్టుకుని కూడా బిజినెస్ జరుగుతోంది. ఇక, మరోసారి రియల్ ఎస్టేట్ రంగంలో తనకు తిరుగులేదని నిరూపించుకుంది హైదరాబాద్… 2021 ఏడాదిలోనూ రియల్ కింగ్‌గా నిలిచింది… ఓవైపు కరోనా మహమ్మారి కష్టాలు చుట్టుముట్టినా… రియల్ ఎస్టేట్ రంగం భాగ్యనగరంలో జోరు మీదే ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి… 2021 ఏడాదికి సంబంధించి దేశంలోనే ఎక్కువ ఇళ్లు అమ్ముడైన మెట్రో సిటీగా మొదటి స్థానంలో నిలిచి సత్తా చాటింది హైదరాబాద్..
ఏడాది చివరన డిసెంబర్ నెలలో అమ్ముడైన ఇళ్ల యూనిట్ల సంఖ్యలో తగ్గుదల కనిపించినా.. రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో తగ్గేదేలే అనిపించింది. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్ నగర పరిధిలో 3,931 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి.. ఈ రిజిస్ట్రేషన్ విలువ ఏకంగా రూ.2,340 కోట్లుగా నిలిచింది. గతేడాది ఇదే నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో పోల్చితే 16 శాతం వృద్ధి కనిపించింది. డిసెంబర్‌లో అమ్ముడైన ఇళ్లలో అత్యధికం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నాయి. మహా నగర అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారించిన ప్రభుత్వం.. శివారు ప్రాంతాల్లోనూ అభివృద్ధికి భారీగా ఖర్చు చేస్తోంది.. కొత్తగా ఏర్పాటైన మున్సిపల్ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీల్లో జోరుగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.. ఇవి కూడా రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇస్తున్నాయి.
Also Read
- OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Off The Record : ఆకునూరి మురళి రాజీనామా వెనుక అసలు కథ ఏంటి? విద్యా కమిషన్‌లో ఏం జరిగింది?
- Telangana Transfers : తెలంగాణలో ఐఏఎస్, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు..
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?