Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్‌ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా బ్రిస్టల్ వేదికగా జరుగుతున్న నాల్గవ టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇన్నింగ్స్ ప్రారంభంలోనే జట్టుకు గట్టి షాక్ తగిలింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. కేవలం 10 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్‌తో 15 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించిన వైభవ్.. ఆర్చర్ వేసిన షార్ట్ లెంగ్త్ బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించి మిడ్-ఆన్‌లో సామ్ కరన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వైభవ్ తన మొదటి మూడు ఇన్నింగ్స్‌లలో 14, 13, 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. వరుసగా లభిస్తున్న మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మార్చలేకపోవడంతో అతడు తీవ్ర నిరాశతో పెవిలియన్ వైపుగా నడుచుకుంటూ వెళ్లాడు.
Also Read
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
ఆర్చర్ చేతిలో వైభవ్ సూర్యవంశీ ఇలా అవుటవ్వడం ఇది వరుసగా రెండోసారి కావడం గమనార్హం. గత మ్యాచ్‌లో కూడా ఆర్చర్ బౌలింగ్‌లోనే వైభవ్ తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, వీరిద్దరూ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున సహచర ఆటగాళ్లుగా ఆడుతున్నారు. ఒకే జట్టులో ఉండటం వల్ల వైభవ్ బ్యాటింగ్ శైలిని, అతని బలహీనతలను ఆర్చర్ చాలా నిశితంగా గమనించాడు.
అందుకే ఈ సిరీస్‌కు ముందే ఐపీల్ లో ఓ మ్యాచ్ ముగిసిన సమయంలో ఆర్చర్ మాట్లాడుతూ.. వైభవ్‌ను ఎలా అవుట్ చేయాలో, అతనికి ఏ లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ వేయాలో తనకు బాగా తెలుసని.. కానీ అది నేను రివీల్ చేయను అని చెప్పాడు. ప్రస్తుతం అతడు చెప్పిన విధంగానే ఈ మ్యాచ్‌లో కూడా ఆర్చర్ తన పక్కా ప్రణాళికను అమలు చేసి వైభవ్‌ను బోల్తా కొట్టించాడు. ఆర్చర్ సంధించిన 140 కిలోమీటర్ల పైమాటా వేగానికి, ముఖ్యంగా అతని షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో వైభవ్ ఇబ్బంది పడుతున్నాడని ఈ వికెట్ ద్వారా స్పష్టమైంది.
వైభవ్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, మరో ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. ఆర్చర్ తన మొదటి రెండు ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక కీలక వికెట్ పడగొట్టి ఇంగ్లాండ్‌కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. భారత్ పవర్‌ప్లేలో వేగంగా పరుగులు రాబట్టాలని చూస్తున్నప్పటికీ, ఆర్చర్ లైన్ అండ్ లెంగ్త్ వారిని కట్టిపడేస్తోంది. సహచర ఐపీఎల్ ఆటగాడి వ్యూహాన్ని ఛేదించలేక వైభవ్ దొరికిపోవడంతో, రాబోయే మ్యాచ్‌ల్లో అతడు తన షార్ట్ పిచ్ బంతుల ఆటను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!