IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్‌లో రెండు మార్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు (శుక్రవారం) నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు కాసేపట్లో ముందుగా బౌలింగ్ చేయనుంది.
కెప్టెన్ల మాటల్లో..
టాస్ గెలిచిన అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. “మేము మొదట బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ చాలా బాగుంది. గత మ్యాచ్‌ల్లో మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం, కానీ ఆటగాళ్లు పూర్తి ఉత్సాహంతో ఉన్నారు. పరిస్థితులకు త్వరగా అలవాటు పడి, వ్యూహాత్మకంగా రాణించాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం జట్టులో రెండు మార్పులు చేశాం. వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చారు” అని తెలిపాడు.
Also Read
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
మరోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగే ఎంచుకునేవాళ్లమని చెప్పాడు. పిచ్‌పై సమానంగా ఉన్న గడ్డి బ్యాటింగ్‌కు అనుకూలించేలా ఉందన్నాడు. గత మ్యాచ్‌లో జట్టుగా అద్భుతంగా రాణించామని, సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉన్నామని తెలిపాడు. ఇంగ్లాండ్ జట్టులో లియామ్ డాసన్ స్థానంలో రేహాన్ అహ్మద్ జట్టులోకి వచ్చినట్లు పేర్కొన్నాడు.
తుది జట్లు (Playing XI):
భారత్: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఇంగ్లాండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, రేహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్.
తాజావార్తలు
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!