HayatNagar Rave Party: హైదరాబాద్ హయత్ నగర్ రేవ్ పార్టీ సంచలనంగా మారింది. పక్కాసమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు షాక్ తిన్నారు. 37 మంది గంజాయి మత్తులో ఉండడాన్ని గమనించారు. దీంతో 37 మందిని అదుపులో తీసుకున్నారు. రేవ్ పార్టీని భగ్నం చేశారు. బర్త్‌డే పార్టీ పేరుతో రేవ్ పార్టీని చేస్తుండటంతో రాచకొండ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. 34 మంది విద్యార్థులతో పాటు ముగ్గురు గంజాయి అమ్మకం దారులను అదుపు తీసుకున్న పోలీసులు. అయితే రేవ్ పార్టీ పై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈనేపథ్యంలో.. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి Ntv తో మాట్లాడుతూ.. రేవ్ పార్టీ ప్రీ ప్లాన్ గా జరిగిందని అన్నారు. ఈ పార్టీలో మూడు కాలేజ్ ల బీటెక్ విద్యార్థులు పాల్గొన్నారని అన్నారు. పార్టీకి వచ్చిన వారికి రోహిత్ అనే యువకుడు గంజాయి సరఫరా చేసాడని, రోహిత్ ఆచూకీ కోసం గాలిస్తున్నామని తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా శివారులో ఉన్న ఫార్మ్ హౌస్ లపై నిఘా పెడుతున్నామని తెలిపారు. చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Read also: AP Skill Development Scam: AP స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ స్కాం… ఈడీ ఫోకస్
హయత్ నగర్ లో బర్త్‌డే పార్టీ పేరుతో రేవ్ పార్టీని చేస్తుండటంతో రాచకొండ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. 34 మంది విద్యార్థులతో పాటు ముగ్గురు గంజాయి అమ్మకం దారులను అదుపు తీసుకున్న పోలీసులు. బర్త్ డే పార్టీ పేరుతో విద్యార్థులు రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారని పోలీసులు నిర్ధారించారు. విద్యార్థులకు గంజాయి సప్లై చేసినా నలుగురిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. సహితు చారి ,చరణ్ రెడ్డి ,హిమాచరణ్ రెడ్డి, విశ్వచరణ్ రెడ్డి లను పోలీసులు అదుపులో తీసుకున్నారు. విద్యార్థుల రేవ్ పార్టీకి అనుమతించిన సన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాదులోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులే నిర్వాకులుగా గుర్తించారు పోలీసులు. విద్యార్థులు ఎంజాయ్ మెంట్ పేరు తో రేవ్ పార్టీ చేస్తున్నారు. అర్ధరాత్రి వచ్చిన సమాచారంతో పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు.
Read also: AP Skill Development Scam: AP స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ స్కాం… ఈడీ ఫోకస్
రేవ్ పార్టీలో పాల్గొన్న విద్యార్థులను అదుపులో తీసుకొని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. బర్త్ డే పార్టీ కేసును పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. డిసెంబర్ 2వ తేదీన రాత్రి 12 30నిమిషాలకు బర్త్ డే పార్టీని విద్యార్థులు నిర్వహించారు. పసుమాముల విలేజ్ లో ఉన్న out of the బాక్స్ లో 33 మంది విద్యార్థులు బర్త్ డే పార్టీ చేసుకున్నారు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి వారి వద్దనుంచి 10 కార్లు, 30 మొబైల్ ఫోన్స్, ఒక బైక్, 50 గ్రామూల గంజా, 8 సిగరెట్లు, లిక్కర్ బాటిల్స్, DJ సౌండ్ సిస్టమ్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. గంజాయి దొరికిన ముగ్గురు విద్యార్థులపై సాయి చరణ్ రెడ్డి , హిమ చరణ్ రెడ్డి , విశ్వ చరణ్ రెడ్డిపై కేస్ నమోదు చేశారు. మరో ముగ్గరు ఇద్దరు విద్యార్థులు పరారీలో ఉన్నారు. సనీత్ చారి, రోహిత్ తో పాటు ఫార్మ్ హౌస్ ఓనర్ సన్నీ కిరణ్ అదుపులో తీసుకున్నారు. పరారీలో ఉన్న వారికోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
Team India: రిషబ్ పంత్‌కు ఉద్వాసన.. కెప్టెన్ రోహిత్ ఏం చెప్పాడంటే..?