ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో చోటుచేసుకున్న కుంభకోణం కలకలం రేపుతోంది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లో భారీగా కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి జర్మనీకి చెందిన సీమెన్స్ సంస్థకు వృత్తి నైపుణ్యంపై శిక్షణ ఇచ్చే విషయమై ఒక ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు విలువ 3 వేల 350 కోట్ల రూపాయలు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తో సీమెన్స్ సంస్థ ఈ 3 వేల 350 కోట్ల ప్రాజెక్టు ఒప్పందం కుదుర్చుకుంది.
Read Also: YSRCP: బావ, బావమరిది మధ్యలో మామ.. వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో ఆస్తి గొడవలు
అందులో 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా 370 కోట్ల రూపాయలు. ఈ ప్రభుత్వ వాటాలోని 370 కోట్లలో సుమారు 241 కోట్ల 78 లక్షల 61 వేల 508 రూపాయలు దారిమళ్ళించారు. స్కిల్ డెవలప్ మెంట్ లో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఏపీ ప్రభుత్వం నుండి 370 కోట్లు బిల్లులు తీసుకున్న సిమెన్ సంస్థ జీఎస్టీనీ కూడా ఎగ్గొట్టడంతో బయటికి పొక్కింది విషయం. ఫేక్ ఇన్ వాయిస్ లతో ఎగనామం పెట్టడాన్ని జీఎస్టీ అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ జరిపారు. సీఐడీ కేసును తన పరిధిలోకి తీసుకున్న ఈడీ కూపీ లాగుతోంది. ఏపీలో స్మిల్ డెవలప్మెంట్ స్కాం పై ఈడీ ఫోకస్ పెట్టడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది.
ఈవ్యవహారానానికి సంబంధించి మాజీ ఛైర్మన్ గంటా సుబ్బారావు, మాజీ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, ఓఎస్డీ నిమ్మగడ్డ ప్రసాద్‌కు ఈడీ నోటీసులు జారీచేసింది. రేపటి నుంచి హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది ఈడీ. స్కాం లో నిందితులుగా ఉన్న వారిలో 26 మందికి నోటీసులు జారీ అయ్యాయి. 234 కోట్ల నిధులు మళ్లించినట్లు గుర్తించారు విచారణ అధికారులు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కాంపై ఈడీ ఫోకస్ పెట్టడంతో ఇందులో ఎవరి ప్రమేయం ఉందో బయటకు రానుంది.
ఈస్కాంలో నిందితులుగా ఉన్నవారందరికీ ఈడీ నోటీసులు జారీచేయడంతో డొంకంత కదులుతుందని భావిస్తున్నారు. పలు షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు జరిగిందని తెలుస్తోంది. మాజీ చైర్మన్ గంటా సుబ్బారావు, మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు నోటీసులు అందాయి. ఓఎస్డీ నిమ్మగడ్డ కృష్ణప్రసాద్‌కు నోటీసులు జారీ అయ్యాయి. రేపు హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసులు జారీకావడంతో ఈవ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని భావిస్తున్నారు.
ఇన్‌వెబ్ సర్వీస్ నుంచి సీమెన్స్‌తో పాటు డిజైన్ టెక్ కంపెనీకి నిధుల మళ్లింపు జరిగింది. కార్పొరేషన్ మాజీ ఎండీ గంటా సుబ్బారావుకు చెందిన ప్రతీక్ ఇన్ఫో సర్వీసెస్‌కు రూ. కోట్ల మళ్లింపు జరిగినట్టుగా భావిస్తున్నారు. రూ. 370 కోట్లలో సుమారు 241 కోట్ల 78 లక్షల 61 వేల 508 రూపాయలు దారిమళ్లాయి. స్కిల్ డెవలప్ మెంట్ లో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ లో నిర్ధారణ అయింది. మొత్తం మీద ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈడీ దర్యాప్తులో కొత్త కోణం
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఈడీ దర్యాప్తులో కొత్త కోణం బయటపడింది. ఇప్పటికే సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థల ప్రతినిధుల విచారణ చేపట్టింది ఈడీ. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలో భాగంగా నాటి ప్రభుత్వం సీమెన్స్ సంస్థతో రూ. 3350 కోట్లతో ఒప్పందం చేసుకుంది. సీమెన్స్ సంస్థ 90 శాతం విడుదల చేశాకే.. రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులను విడుదల చేయాలనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. 90 శాతం నిధులు సీమెన్స్ నిధులను విడుదల చేసిందా..? లేదా..? ఒకవేళ సీమెన్స్ సంస్థ 90 శాతం నిధులు విడుదల చేస్తే ఆ నిధులమేయ్యాయనే కోణంలో ఈడీ దర్యాప్తు నిర్వహిస్తోంది. సీమెన్స్ నిధులు విడుదల చేయకుండానే ఏపీ ప్రభుత్వం తన వాటాను విడుదల చేసిందా అనే అంశంలోనూ కూపీ లాగుతోంది ఈడీ.
Read Also: Bandi Sanjay: దొంగ దందా చేస్తే మోడీ ప్రభుత్వం వీపంతా సాఫ్ చేస్తది