YS Jagan: తెలంగాణలోని చేవెళ్ల దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు మృత్యువాత పడడంపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీ కొట్టడంతో పలువురు మృతి చెందడం తీవ్రంగా కలచివేసింది. ఈ దుర్ఘటన చాలా బాధాకరం.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి.. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని కోరారు.
Read Also: The RajaSaab : రెబల్ స్టార్ ‘రాజాసాబ్’ సంక్రాంతికి వస్తుందా.. మరోసారి వాయిదా వేస్తారా?
మరోవైపు, చేవెళ్ల బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. క్షతగాత్రులకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు తెలిపింది. దీంతో బీజాపూర్ హైవేపై వాహనాలను దారి మళ్లించారు. తాండూర్, వికారాబాద్ నుంచి వస్తున్న వాహనాలను శంకర్పల్లి మీదుగా దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు.