ఈ ఏడాదిలో ప్రభాస్ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. కన్నప్ప సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించిన డార్లింగ్, మిరాయ్ సినిమాలో తన వాయిస్ ఓవర్‌తో పలకరించాడు. వాస్తవానికి, ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ డిలే కావడంతో పాటు సీజీ వర్క్ అనుకున్న సమయానికి పూర్తి అయ్యేలా లేదని వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేశారు. సంక్రాంతి అంటే సినిమాల సీజన్ కాబట్టి మేకర్స్ జనవరి 9న రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. అయితే, ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరోసారి షాక్ తప్పదనే టాక్ వినిపిస్తోంది.
Also Read : Jailer2 : జైలర్ 2 ను స్టార్స్ తో నింపేస్తున్న నెల్సన్.. తేడా వస్తే విమర్శలు తప్పవు
రాజాసాబ్ జనవరి రిలీజ్ లేదని మరోసారి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. షూటింగ్ పూర్తైనప్పటికీ సీజీ వర్క్ అనుకున్న సమయానికి కంప్లీట్ అయ్యేలా లేదట. దీంతో రాజాసాబ్ సమ్మర్ వైపు చూస్తున్నట్టుగా ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. ప్రస్తుతానికైతే రాజాసాబ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. మరోవైపు షూటింగ్ కూడా ఆల్మోస్ట్ పూర్తి కావొచ్చింది. దాదాపుగా సంక్రాంతికే ఈ సినిమాను రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు దర్శకుడు మారుతి. కానీ సీజి వర్క్ అనుకున్న టైమ్ కు ఫినిష్ అయ్యాలా లేదు. అలాగే ఓటీటీ బిజినెస్ కూడా ఇంకా అవలేదు. అటు ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన రాజాసాబ్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. పీపుల్ మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరిపొంగల్ కు రిలీజ్ చేస్తారా లేక వాయిదా వేస్తారా అనేది చూడాలి.