Chevella Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొట్టడంతో దాదాపు 20 మంది స్పాట్ లోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది తీవ్రంగా గాయపడటంతో వారిని చేవెళ్లలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ యాక్సిడెంట్ గురించి తెలిసన వెంటనే రెస్క్యూ టీమ్ సంఘటన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.
Read Also: Bihar Elections: గురువారమే తొలి విడత పోలింగ్.. అన్ని పార్టీలు ఉధృతంగా ప్రచారం
అయితే, ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. లారీ అతీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో టిప్పర్ లోని కంకర మొత్తం బస్సులో పడింది. దీంతో కంకర కింద మృతదేహాలు కూరుకుపోయినట్లు తెలుస్తుంది. ఇక, వికారాబాద్- చేవెళ్ల మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఘటనా స్థలానికి అంబులెన్స్ లు కూడా చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. కాగా, మీర్జగూడ దగ్గర ప్రమాదంలో చనిపోయిన 10 మంది మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి ట్రాఫిక్ పోలీస్ వాహనంలో తరలించినట్లు తెలుస్తుంది.