వేములవాడలో ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సే.. ఇప్పుడు మిగిలిన వాటిని పూర్తి చేసేది కూడా కాంగ్రెస్సేనని అన్నారు. కేసీఆర్ గడీలను కూల్చేందుకే పాదయాత్ర చేశానని తెలిపారు. కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు నాయకత్వం వహించింది.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని సోనియా ఆనాడు మాట ఇచ్చారు.. కరీంనగర్ గడ్డపై ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పొన్నంని ఒక్కసారి ఎంపీగా గెలిపిస్తే తెలంగాణ వచ్చింది.. బండి సంజయ్‌ని రెండు సార్లు గెలిపిస్తే కరీంనగర్ కి పైసా అయినా తెచ్చిండా…? అని సీఎం ప్రశ్నించారు. మిడ్ మానేర్ నిర్వాసితుల పోరాటంలో పాల్గొని వారికి ఇచ్చిన హామీని ఈరోజు అమలు చేశామని ముఖ్యమంత్రి అన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై దృష్టిపెట్టాం.. ఈ ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్నవాటిని వెంటనే పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.
Uttar Pradesh: బీజేపీకి మద్దతు ఇస్తుందని దళిత యువతిని హత్య చేసిన ఎస్పీ నేత..
ప్రజలనే కాదు.. వేములవాడ రాజన్నని కూడా కేసీఆర్ మోసం చేశాడని దుయ్యబట్టారు. పీసీసీ అధ్యక్షుడిగా పలుమార్లు వేములవాడ వచ్చానని సీఎం తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రూ.20 లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు చేశారు.. వేములవాడకి ఎంత ఇచ్చారు..? అని అన్నారు. వేములవాడ రాజన్న గుడికి 100 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వలేకపోయారు..? అని ప్రశ్నించారు. ఓడిపోయిన తర్వాత ఫార్మ్ హౌస్‌కి కేసీఆర్ పరిమితం అయితే.. హరీష్, కేటీఆర్‌లు మా కాళ్ళలో కర్ర పెడుతున్నారు.. అధికారం పోయాక మతిలేకుండా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఆత్మహత్యల్లో రెండవ స్థానంలో ఉండేది రాష్ట్రం.. అప్పట్లో రుణమాఫీ చేసి ఆదుకున్నాం.. పదేండ్ల పాలనలో నువ్వు చక్కగా పాలన చేస్తే తాము 25 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సిన అవసరం వచ్చేదా? అని దుయ్యబట్టారు.
కేసీఆర్ అసెంబ్లీకి రా… రుణమాఫీ లెక్కలు చెప్తామని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో 50 వేల ఉద్యోగాలిచ్చాం.. ఒక్కటి తక్కువ అయినా క్షమాపణ చెప్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Hyderabad: హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు..
మరోవైపు.. గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం.. గల్ఫ్‌లో మరణించిన వారికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. త్వరలోనే గల్ఫ్ బోర్డ్ ఏర్పాటు పనులు ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. లగచర్ల లో 11 వందల ఎకరాల భూమి మాత్రమే సేకరిస్తున్నాం.. భూమి సేకరించి వారికి మంచి పరిహారం ఇచ్చేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చామని సీఎం పేర్కొన్నారు. కేటీఆర్ నువ్వు ఢిల్లీకి పోయినా.. చంద్రమండలం పోయినా తప్పు చేస్తే కటకటాల్లోకి పోవుడు ఖాయమని హెచ్చరించారు. కేటీఆర్ ఊసలు లెక్క పెడతావు గుర్తు పెట్టుకో..
ఎందుకులే ఉయ్యాల ఊగి ఊగి ఆగుతుంది కదా అని అనుకున్నా అని సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.