వేములవాడలో ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సే.. ఇప్పుడు మిగిలిన వాటిని పూర్తి చేసేది కూడా కాంగ్రెస్సేనని అన్నారు. కేసీఆర్ గడీలను కూల్చేందుకే పాదయాత్ర చేశానని తెలిపారు. కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు నాయకత్వం వహించింది.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని సోనియా ఆనాడు మాట ఇచ్చారు.. కరీంనగర్ గడ్డపై ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.