Komati Reddy: హరీశ్ కామెంట్స్ కు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తనకు మంత్రి పదవి రావటం విషయంలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. గంట సమయం ఇచ్చినా హరీష్ సరిపోలేదు అంటున్నారని అన్నారు. మేన మామా సాలు వచ్చింది హరీష్ కి అని తెలిపారు. అబద్ధం చెప్పడంలో మేన మామా సాలు వచ్చిందన్నారు. ఎన్నేళ్ళు కష్టపడ్డ.. హరీష్ నిన్ను సీఎం చేయరని అన్నారు. తండ్రి.. కొడుకులు వాడు కుంటారని తెలిపారు. మంత్రి పదవి రావాలా వద్దా అనేది సీఎం.. అధిష్టానం చూసుకుంటుందన్నారు.
Read also: Revanth Reddy vs Harish Rao: కాళేశ్వరం నీటిపై అసెంబ్లీలో రచ్చ..
శ్వేతపత్రంలోని పలు అంశాలను తప్పుబట్టారు. ప్రభుత్వం కేవలం వారికి అనుకూలంగా ఉండే విధంగా మాత్రమే గణాంకాలను తీసుకుందని తెలిపారు. ప్రధానంగా కరోనా కాలంలోని గణాంకాలను తీసుకుందని విమర్శించారు. 2014 – 15లో జీతాలు, పెన్షన్ల వ్యయం రూ. 17, 130 కోట్లు ఉండగా… 2021 – 22లో రూ. 48,809 కోట్లుగా ఉంది. దాదాపు మూడు రెట్లు పెరిగిందని ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రంలో తెలిపింది. గృహనిర్మాణశాఖకు సంబంధించి 6,470 కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. తాగునీటి కార్పొరేషన్ కు సంబంధించి రూ. 20,200 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి రూ. 2,951 కోట్ల బకాయిలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న 14 SPVలు , సంస్థలు మొత్తం రూ. 1,18,557 కోట్ల రుణాన్ని సేకరించాయి.
Read also: Konda Surekha vs Harish Rao: కేంద్రాన్ని దూరం పెట్టిందే బీఆర్‌ఎస్ పార్టీ.. కొండ సురేఖ ఫైర్
గత ప్రభుత్వాన్ని బద్నామ్ చేస్ విదంగా ఒక సస్పెండ్ అయినా మాజీ ఫైనాన్స్ అధికారితో ఈ శ్వేతపత్రాన్ని తయారు చేయించారని ఆరోపించారు హరీశ్ రావు. సమయం వొచ్చినప్పుడు పేర్లతో సహా బయట పెడతామన్నారు. కేవలం అప్పులను మాత్రమే ప్రస్తావించి.. గత ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా శ్వేతపత్రాన్ని తయారు చేశారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. సభలో వాగ్వాదం నెలకొంది. హరీశ్ రావుకు మైక్ ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందించారు. ఈ సందర్భంలో పీసీసీ పదవి అంశాన్ని ప్రస్తావించటంతో సభలో వాగ్వాదం నెలకొంది.
NZ vs BAN: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన బంగ్లాదేశ్ బ్యాటర్.. దిగ్గజాల వల్ల కూడా కాలే!