Satyavathi Rathod: మునుగోడు ఉప ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్ అనే చెప్పాలి. పోటీపోటీగా ప్రచారంలో పార్టీనేతలు దూసుకుపోతున్నారు. ఒకరినొకరు విమర్శనాస్త్రాలు వేస్తూ పార్టీకోసం ప్రచారం చేస్తున్నారు. మనుగోడు ప్రచారంలో భాగంగా.. మంత్రి సత్యవతి రాథోడ్ బీజేపీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పై విమర్శలు గుప్పించారు. మునుగోడులో తన స్వంత ప్రయోజనం కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని ఆరోపించారు. 3 యేండ్లు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేయని ఎమ్మెల్యే రాజగోపాల్, ఇవాళ ఏం చేస్తాడని ఎద్దేవ చేశారు. రాజగోపాల్ రెడ్డిని ఓడగేట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి తిరస్కరిస్తారని ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించారని గుర్తుచేశారు.
Read also: Somu Veerraju: ఏపీ అభివృద్ధికి పాటుపడుతోంది బీజేపీయే
సీఎం కేసీఆర్ రాజకీయ అనుభవం అంత లేని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఇష్టవచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మునుగోడులో నిల్వబోతుందని అన్నారు. నల్గొండ జిల్లాలో ఇప్పటికి 3 ఉప ఎన్నికలు వచ్చాయి.. అందులో ఇప్పటికే 2 భారీ మెజారిటీతో గెలిచామని గుర్తుచేశారు మంత్రి సత్యవతి రాథోడ్. రాజగోపాల్ కాంట్రాక్టుల కోసమే బీజేపీలోకి వెళ్లారని ఆరోపించారు. పోరాటాల్లో ముందున్న కమ్యూనిస్టు పార్టీలు, నేతలు మాకు మద్దతుగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ ఒక్క మేనమామా లాగా ఆడపిల్లకు అండగా ఉండి కల్యాణ లక్ష్మీ వంటి పథకాలు పెట్టారని గుర్తుచేశారు. మునుగోడులో ఆడబిడ్డలు, కొత్త కోడళ్లు టీఆర్ఎస్ అండగా ఉన్నారని వాళ్ళ ఓట్లు తొలగించాలని చూస్తున్నారు. కానీ, వీళ్ళు ఓట్లు తొలిగించాలని చెప్పిన టీఆర్ఎస్ కు అండగా ఉంటారు.. ఆయన అయ్యేది లేదు పోయేది లేదు మాకు భారీ మెజారిటీ వస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
Ponniyin Selvan: పది రోజుల్లోనే మరో మైల్‌స్టోన్.. ఏకంగా 400 కోట్లు