Site icon NTV Telugu

Raja Singh: ఆమ్నేషియా కేసులో నిందితుల పేర్లు బయటపెట్టాలి

Raja Singh

Raja Singh

జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్ అమ్మాయిపై లైంగిక దాడి కేసులో నిందితుల పేర్లను వెంటనే బయటపెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఐదుగురు అమ్మాయిపై లైంగిక దాడి చేశారు.. దీనిపై గత నెల 28న అమ్మాయి ఫిర్యాదు చేస్తే మే 31 పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి మూడు రోజుల ఆలస్యం ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. సామూహిక లైంగిక దాడి కేసులో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ నేతల కొడుకులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని అన్నారు. నిజమేంటో పోలీసులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నిందితుల పేర్లు మార్చేందుకు పోలీసులపై ప్రెజర్ ఉన్నట్లు తెలుస్తోందని రాజా సింగ్ అన్నారు. ఈ కేసు నుంచి నిందితులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తుల పేర్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేయలేదు కానీ.. వారు ఉపయోగించిన వాహనాల పేర్లను నమోదు చేశారని..ఆ యువతిని ఆ వాహనాలు రేప్ చేశాయా? వ్యక్తులా? అంటూ ప్రశ్నించారు. ఈ కేసులో పెద్ద కుట్ర జరుగుతోందని..పేర్లు మార్చి వేరే వ్యక్తుల పేర్లు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సీసీ కెమెరాలు పెట్టారు, అందులో నిందితులు దొరకలేదా.? ఈ రెండు వాహనాల్లో ఎంతమంది యువకులు ఉన్నారో కూడా గుర్తించలేదా.? అని ప్రశ్నించారు.

గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు యాక్సిడెంట్ చేసినప్పుడు కూడా పేర్లు మార్చాలని ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో అత్యాచారాలు చేసేది, యాక్సిడెంట్లు చేసేది రాజకీయ నాయకుల కొడుకులే అని..మా నాన్న టీఆర్ఎస్ లో పెద్ద లీడర్, మా నాన్నకు రాజకీయంగా బాగా పలుకుబడి ఉందని బడా నేతల కొడుకులు భావిస్తున్నారని..అందుకే మేము అత్యాచారాలు చేస్తాం, యాక్సిడెంట్లు చేస్తామంటూ చెలరేగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version