Bharat Jodo Yatra: తెలంగాణలో రాహుల్ పాదయాత్రలో స్వల్ప మార్పులు.. ఫైనల్ రూట్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక చిత్రదుర్గలో 36వ రోజు రాహుల్ జోడోయాత్ర కొనసాగింది.. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు మొత్తం 930 కిలోమీటర్లు పాదయాత్రను పూర్తి చేసుకున్నారు రాహుల్. ఉదయం బొమ్మనగండన హళ్లి నుంచి ప్రారంభమైన జోడో యాత్ర.. సాయంత్రం రాంపురాలో ముగిసింది. ఉదయం అక్కడి నుంచే మళ్లీ యాత్ర ప్రారంభించనున్నారు. ఇక, త్వరలోనే తెలంగాణలో రాహుల్ గాంధీ అడుగుపెట్టబోతున్నారు.. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ఖరారుపై సుదీర్ఘ కసరత్తు చేసింది తెలంగాణ కాంగ్రెస్.. ముందుగా అనుకున్న రూట్లో కొన్ని మార్పులు చేసి.. ఫైనల్ రూట్ మ్యాప్ ఖరారు చేశారు. దీని ప్రకారం.. తెలంగాణలో మొత్తం 375 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర సాగనుంది.. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ దగ్గర పోరాటాల గడ్డపై రాహుల్ గాంధీ అడుగుపెడతారు.
Read Also: TSPSC Group 1 Exam: ఈనెల 16న గ్రూప్-1 పరీక్ష.. ఇవి మాత్రం మర్చిపోవద్దు..!
Also Read
- KTR: "మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి".. అలాంటి వాళ్లకే కార్పొరేట్ టికెట్ ఇస్తామన్న కేటీఆర్..
- Hyderabad: పసిబిడ్డతో వెళ్తున్న మహిళపై కామాంధుడి వికృత చేష్టలు.. ఇంకొకడు ఇలాంటి పని చేయాలంటే వణుకు పుట్టేలా..
- OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
తెలంగాణలో రాహుల్ గాంధీ యాత్రపై టీ-కాంగ్రెస్ కసరత్తు చేసింది. తెలంగాణకు వచ్చిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్… గాంధీభవన్‌లో ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. రాహుల్ భారత్ జోడో యాత్ర ఏర్పాట్లు, రూట్ మ్యాప్‌పై చర్చించారు. రాహుల్ యాత్రకు చేయాల్సిన ఏర్పాట్లపై నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీ వేణుగోపాల్. హైదరాబాద్‌లో రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్‌లో స్వల్ప మార్పులు చేశారు. చార్మినార్ నుంచి ప్రారంభం కానున్న యాత్ర.. గాంధీ భవన్, ఇందిరా విగ్రహం వరకు కొనసాగుతుంది. అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ తరువాత ఇందిరా గాంధీ విగ్రహం నుండి బోయిన్ పల్లిలో గాంధీ ఐడియాలజీ కేంద్రం, బాలానగర్, ముసాపేట, కూకట్ పల్లి, మియాపూర్, బెల్ మీదుగా పటాన్‌చెరుకు చేరుకుంటుంది. తెలంగాణలో మొత్తం 375 కిలోమీటర్ల మేర రాహుల్ భారత్ జోడో యాత్ర జరగనుంది.
ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 23న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశిస్తుందన్నారు.. కర్ణాటక నుంచి కృష్ణా నది బ్రిడ్జి మీదుగా మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుందని వెల్లడించారు.. యాత్రపై సమన్వయం చేసుకునేందుకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ లను నియమించామన్న ఆయన.. ఈ నెల 31న జోడో యాత్ర హైదరాబాద్ లోకి ప్రవేశిస్తుందని తెలిపారు.. హైదరాబాద్ లో చార్మినార్ నుంచి యాత్ర ప్రారంభమై గాంధీ భవన్ మీదుగా నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు చేరుకుంటుంది.. ఇందిరా గాంధీ వర్దంతి సందర్బంగా నెక్లెస్ రోడ్ లో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ వరకు జోడో యాత్ర కొనసాగుతుందని.. పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతీ కార్యకర్త, నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు రేవంత్‌రెడ్డి.

తాజావార్తలు
-
KTR: “మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి”.. అలాంటి వాళ్లకే కార్పొరేట్ టికెట్ ఇస్తామన్న కేటీఆర్..
-
Pakistan: హైజాక్ చేసిన అదే రైలు.. “జాఫర్ ఎక్స్‌ప్రెస్”నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?
-
Gujjalapudi Hari: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గుజ్జలపూడి హరి కన్నుమూత
-
Rishabh Pant’s LSG Captaincy: రూ.27 కోట్లు పెట్టి కొంటే.. అట్టర్ ఫ్లాప్ ప్రదర్శన.. పంత్ కెప్టెన్సీకి ముప్పు!
-
BYD Atto 3: BYD అట్టో 3 విడుదల.. 630KM రేంజ్, LiDAR టెక్నాలజీ, కేవలం 9 నిమిషాల్లో పూర్తి ఛార్జ్
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?