TS Congress: నేడే తెలంగాణకు ప్రియాంక గాంధీ.. నవంబర్ 1, 2న రాహుల్ బస్సుయాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Congress: రెండో విడత ఎన్నికల ప్రచారానికి ప్రియాంక గాంధీ ఈరోజు తెలంగాణకు రానున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్, దేవరకద్రలో జరిగే బహిరంగ సభల్లో ఆమె పాల్గొంటారని పార్టీ శ్రేణులు వెల్లడించాడరు.. అయితే దేవరకద్ర సభ రద్దైనట్లు తెలిపారు. ప్రియాంక గాంధీ నేరుగా కొల్లాపూర్ సభకు హెలికాప్టర్ లో చేరుకుంటారు. సభ ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు. అలాగే నవంబర్ 1, 2 తేదీల్లో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుంది.నవంబర్ 1న కల్వకుర్తి, జడ్చర్ల షాద్ నగర్ సభల్లో పాల్గొంటారు.నవంబర్ 2న మేడ్చల్, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్ సభల్లో రాహుల్ ప్రసంగిస్తారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకతో కలిసి గత నెల 18న ములుగు జిల్లా బహిరంగ సభలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అక్టోబర్ 19, 20 తేదీల్లో ఉత్తర తెలంగాణలోని ఐదు జిల్లాల్లో పర్యటించిన రాహుల్.. తాజాగా మహిళా ఓటర్లపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రియాంక గాంధీ మంగళవారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రియాంక ప్రచారం నిర్వహించనున్నారు.
Also Read
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
- Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రియాంక గాంధీ నేరుగా కొల్లాపూర్ సభకు హెలికాప్టర్ లో చేరుకుంటారు. పార్టీ ప్రకటించిన ఆరు హామీ పథకాలపై ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగే పాలమూరు ప్రజాభేరి సభలో పాల్గొని ప్రసంగిస్తారు. నవంబర్ 1, 2 తేదీల్లో రాహుల్ గాంధీ మరోసారి బస్సు యాత్ర, రోడ్ షోలలో పాల్గొంటారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.రాహుల్ తొలి విడత యాత్రకు మంచి స్పందన వచ్చింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్ సీఎంలతో రాష్ట్రంలో ప్రచారం చేయించాలని ఆలోచిస్తున్నారు. సభలు, రోడ్ షోల కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. వచ్చే నెల 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్ల అనంతరం ప్రచారంలో వేగం పెంచనున్నారు.
కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని తెలంగాణ జనసమితి ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ బేషరతు మద్దతు ప్రకటించింది. ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. మరో రౌండ్ ప్రచారానికి ప్రియాంక, రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తికావడంతో కాంగ్రెస్ ప్రచారం, ఇతర వ్యూహాలపై దృష్టి సారించింది. సహకరించిన వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మణిరావు ఠాక్రే, కర్ణాటక మంత్రి బోసురాజు కలిశారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం సాగుతోందని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు.
Jasprit Bumrah: బుమ్రా నాకంటే బాగా బౌలింగ్ చేస్తున్నాడు.. పాకిస్థాన్ మాజీ పేసర్ ప్రశంసలు!
తాజావార్తలు
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Shafali Verma: ఆ బ్యాటింగ్ ఏంది స్వామీ.. క్రీజులోకి దిగితే పరుగుల వరదే.. లేడీ సెహ్వాగ్ విశ్వరూపం!
ట్రెండింగ్
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!