Shafali Verma: ఆ బ్యాటింగ్ ఏంది స్వామీ.. క్రీజులోకి దిగితే పరుగుల వరదే.. లేడీ సెహ్వాగ్ విశ్వరూపం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shafali Verma Incredible Batting: భారత మహిళల క్రికెట్ స్టార్ ఓపెనర్, లేడీ సెహ్వాగ్ షఫాలీ వర్మ విశ్వరూపం చూపిస్తోంది. ఫార్మాట్ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా.. తన దూకుడు మాత్రం ఆపడం లేదు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న షఫాలీ.. పరుగుల వరద పారిస్తోంది. ఆసియా కప్ 2026 సెమీ ఫైనల్ నుంచి ఏషియన్ గేమ్స్ 2026 ఫైనల్ వరకు షఫాలీ తన జోరును కొనసాగించింది.
షఫాలీ వర్మ చివరి ఐదు టీ20 ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే.. ఆమె ఫామ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఆసియా కప్ సెమీ ఫైనల్లో 40 బంతుల్లో 64 పరుగులు చేసిన షఫాలీ.. ఫైనల్లో 39 బంతుల్లో 68 పరుగులతో అదరగొట్టింది. ఆ మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా దక్కింది. ఆ తర్వాత ఏషియన్ గేమ్స్‌లోనూ షఫాలీ తన జోరును కొనసాగించింది. క్వార్టర్ ఫైనల్లో జపాన్‌పై కేవలం 15 బంతుల్లోనే 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. భారత్ కేవలం 5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించింది.
Also Read
- ENG vs SL: వరుసగా 3 ఓటములు.. బెన్ డకెట్ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం..!
- India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..
- Ryan Rickelton: 'మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
- AFG vs ZIM: 5 పరుగులకే 4 వికెట్లు.. ఆ తర్వాత ఒమర్జాయ్ సిక్సర్ల సునామీ.. కట్ చేస్తే ప్రపంచ రికార్డ్ సొంతం.!
సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై షఫాలీ వర్మ మరో సంచలన ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి భారత్‌ను భారీ స్కోరు దిశగా నడిపించింది. ఆమె సెంచరీతో టీమిండియా 20 ఓవర్లలో 195/4 పరుగులు చేసింది. అనంతరం భారత బౌలర్లు బంగ్లాదేశ్‌ను 81 పరుగులకే ఆలౌట్ చేయడంతో.. భారత్ 114 పరుగుల భారీ విజయం సాధించింది. ఇక శ్రీలంకతో జరిగిన ఏషియన్ గేమ్స్ ఫైనల్లోనూ షఫాలీ మరోసారి దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. 29 బంతుల్లో 48 రన్స్ చేసింది.
షఫాలీ వర్మ చివరి ఐదు టీ20 స్కోర్లు 64, 68, 40*, 100*, 48గా ఉన్నాయి. అంటే ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు బలమైన ఆరంభాన్ని అందిస్తూ వస్తోంది. ఆసియా కప్‌లో 5 ఇన్నింగ్స్‌ల్లో 236 పరుగులతో టోర్నమెంట్ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచిన షఫాలీ.. ఇప్పుడు ఏషియన్ గేమ్స్‌లోనూ అదే జోరును కొనసాగించింది. షఫాలీ బ్యాటింగ్ కారణంగానే భారత మహిళల జట్టు మరో స్వర్ణంను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం షఫాలీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియాకు ఇంకా ఎన్నో విజయాలు అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Aryan Shukla: ఏఐ కంటే స్పీడ్‌గా లెక్కలేసే భారతీయ కుర్రాడు..16 ఏళ్లకే 9 గిన్నిస్ రికార్డులు, అనేక బంగారు పతకాలు..
-
Machavaram Gas Leak: మాచవరంలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు!
-
ENG vs SL: వరుసగా 3 ఓటములు.. బెన్ డకెట్ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం..!
-
Cyclone Arnab Damage: కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ.. భవిష్యత్తులో కష్టమే!
-
India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!