ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య (Federation of Private Educational Institutions) ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రేపటి నుండి అన్ని పరీక్షలను బహిష్కరించనున్నట్లు ప్రకటించింది. సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం తక్షణం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే బంద్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. “రేపటి నుండి పరీక్షలు బహిష్కరిస్తున్నాం. ప్రభుత్వం దిగివచ్చి మా డిమాండ్ ను పరిష్కరించే వరకు బంద్ కొనసాగుతుంది,” అని రమేష్ బాబు తెలిపారు. ఈ నెల 8న కాలేజీ సిబ్బందితో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు, 11న రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులతో భారీ సభ నిర్వహించే ప్రణాళిక ఉందని ఆయన వెల్లడించారు. “ఏ పరిణామాలు జరిగినా ప్రభుత్వం దే బాధ్యత,” అని ఆయన హెచ్చరించారు.
Rain Forecast in Andhra Pradesh: ఏపీలో మరోసారి భారీ వర్షాలు..!
ప్రభుత్వం సమ్మె విరమించేందుకు రూ.300 కోట్లు ఇస్తామని ప్రతిపాదించినప్పటికీ, యాజమాన్యాలు తిరస్కరించినట్లు తెలిపారు. “9 వందల కోట్లు ఇస్తామన్నా ఒప్పుకోము, బకాయిల్లో 50 శాతం అంటే 5 వేల కోట్లు ఇచ్చే వరకు సమ్మె కొనసాగుతుంది,” అని రమేష్ బాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. “కొన్ని కాలేజీలకు మాత్రమే డబ్బులు ఇచ్చారు. అక్కడి నుండి విచారణ ప్రారంభించాలి. ప్రభుత్వ అధికారులు ఇచ్చిన సర్టిఫికెట్ల వల్లే అక్రమాలు జరిగి ఉండొచ్చు,” అని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రైవేట్ కాలేజీలు బంద్ లో పాల్గొంటున్నట్లు చెప్పారు. అయితే సీబీఐటీ, వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి, మాతృశ్రీ కాలేజీలు ఇంకా పాల్గొనలేదని, వారితో మాట్లాడుతున్నట్లు సమాఖ్య తెలిపింది.
Air India: శాన్ ప్రాన్సిస్కో-న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం మంగోలియాలో ల్యాండింగ్..