Power Charges Effect: మూలిగే మెట్రో బండిపై… విద్యుత్ ఛార్జీల బండ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో విద్యుత్ ఛార్జీలను పెంచడం వల్ల మెట్రో ప్రయాణికులపై అదనపు భారం పడబోతోందా? విద్యుత్ ఛార్జీల పెంపునకు మెట్రో ప్రయాణాలకు సంబంధం ఏంటి? ఎల్ ఎండ్ టీ ఏమంటోంది? తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ ఛార్జీలను పెంచాలని ఇప్పటికే డిస్కంలు ప్రతిపాదించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి యూనిట్ ఛార్జీ 4 రూపాయల 95 పైసలు అవుతుంది. డిమాండ్ ఛార్జీలు ప్రతి కెవిఏకి 85 రూపాయల పెంపుతో 475 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఈ ప్రకారం ప్రతి యూనిట్ ఛార్జీ 6 రూపాయల 57 పైసలు అవుతుందని ఎల్‌అండ్‌టి ఈఆర్సీకి ఇచ్చిన అభ్యంతరాల్లో తెలిపింది.
ఇటు చూస్తే మెట్రో పూర్తిగా విద్యుత్‌తో నడుస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టు కావడంతో ప్రభుత్వంతో ఉన్న ఒప్పందం కారణంగా యూనిట్ ఛార్జీని 3 రూపాయల 95 పైసలు వసూలు చేస్తున్నారు. డిమాండ్ ఛార్జీలు ప్రతి కేవిఏకి 390 రూపాయలను వసూలు చేస్తున్నారు. ఫలితంగా ప్రతి యూనిట్ ఛార్జీ 5 రూపాయల 28 పైసలు పడుతోందని మెట్రో అంటోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూపాయి పెంపుతో యూనిట్ ఛార్జీ 4 రూపాయల 95 పైసలు అవుతుంది. అదనంగా యూనిట్‌పై 1 రూపాయి 29 పైసలు పెరుగుతోంది. ఇది తమకు భారమని ఎల్అండ్టీ వాదిస్తోంది. దీనివల్ల టికెట్ ధరలను పెంచాల్సి ఉంటుందని తెలిపింది.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
భారీగా కరెంట్ ఛార్జీల పెంపుతో మెట్రో నిర్వహణ వ్యయం 25 శాతం పెరుగుతుందన్నది ఎల్ అండ్ టీ వాదన. కొవిడ్ కారణంగా ఇప్పటికీ 25 శాతం ఆక్యుపెన్సీతో మెట్రోరైలు నడుపుతున్నామని ఈఆర్సీకి ఇచ్చిన అభ్యంతరాల్లో తెలిపాయి.
కరెంట్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఆమోదిస్తే ఆ భారం మెట్రోరైలు ప్రయాణికులపై వేయాల్సి వస్తోందని తేల్చి చెప్పింది. మెట్రోకి కాస్ట్ టూ సర్వీసు ఇవ్వాలన్న ఒప్పందం ఉందని గుర్తు చేసింది ఎల్ అండ్ టీ. ఆప్రకారం యూనిట్ ఛార్జీలు ఉండాలని విజ్ఞప్తి చేస్తోంది. దీనిపై ఈఆర్సీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!