Ponnam Prabhakar: బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అవమానాన్ని భరించలేక కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు వస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో వచ్చిన బిఆర్ఎస్ పార్టీ అమరుల త్యాగాలపై ప్రభుత్వము ఏర్పాటు చేసుకొని తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలందరిని సంక్షేమ అభివృద్ధి వైపు నడిపించేందుకు కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల ఆధారంగా ఏర్పడిందని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అవమానాన్ని భరించలేక కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు వస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడికి సముచిత స్థానం ఉంటుందన్నారు.
Read also: MLC Kavitha: ఆతల్లి ఏపీ రాష్ట్రానికి అండగా ఉంటుంది.. కోనసీమలో కవిత పర్యటన
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కారు దిగి హస్తం పార్టీలో చేరారు. తాజాగా జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్‌రెడ్డి దంపతులు బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అధినేత కేసీఆర్‌కు రాజీనామా లేఖ పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అనుబంధ సంస్థ తెలంగాణ ట్రేడర్స్ సెల్ అధ్యక్ష పదవికి కూడా శోభన్‌రెడ్డి రాజీనామా చేశారు. టీఆర్ ఎస్ ఆవిర్భావం నుంచి మాజీ సీఎం కేసీఆర్ వెంటే ఉంటూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. తార్నాకలో టీఆర్‌ఎస్ జెండా రెపరెపలాడింది తామేనని అన్నారు. అప్పటి నుంచి తెలంగాణవాదులుగా కొనసాగుతూ రాష్ట్రం ఏర్పడ్డాక తమకు గుర్తింపు వస్తుందని భావించి 2020లో జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలోగా మేయర్ పదవిని కోరితే కేసీఆర్‌కు డిప్యూటీ మేయర్ పదవిని కేటాయించారు. ఆ తర్వాత భర్త శోభన్‌రెడ్డికి ఉప్పల్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరగా.. కేటాయించలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
KTR: అంత్యక్రియలకు రాలేకపోయా.. లాస్య కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్..