Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివారులోని పొట్లపల్లి రహదారి సమీపంలో ఇటీవల ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని కాలిపోయిన తాటి చెట్లను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. తాటి చెట్లు ప్రకృతి సంపద ఎండాకాలంలో ఎక్కడ కూడా తాటి చెట్లు అగ్నికి గురికాకుండా ఉండడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు, ఫైర్ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో తాటి, ఈత చెట్లను ఎక్కువగా నాటి ఉపాధి హామీ పథకం ద్వారా వాటికి నీళ్లను పోసి వృక్ష సంపదను పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. కాలిపోయిన చెట్ల విషయంలో గీత కార్మికులకు ప్రభుత్వం నుండి సహకారం అందేలా ప్రయత్నం చేస్తా అన్నారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి పురస్కరించుకుని కరీంనగర్ నగరంలోని కోర్టు చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Read also: Mudragada Padmanabham: పవన్‌పై ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు
అక్కడి నుంచి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాటికి నేటికి దేశానికి ప్రపంచ దేశాలకు మార్గదర్శి, దిక్సూచి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ అన్నారు. ప్రజలందరికీ సమన్యాయం ఉండాలని అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం దేశ నిర్మాణానికి, దేశ భవిష్యత్తుకు ఒక దిక్సూచిగా, మార్గదర్శకంగా మారిందన్నారు. నేడు ప్రమాదంలో ఉన్న భారత ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మరొకసారి మనమందరం ప్రతిన భూనాలన్నారు. బడుగు బలహీన వర్గాల బిడ్డగా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సూచించిన మార్గంలో నడుస్తూ తన బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తా అని హామీ ఇచ్చారు.
Purandeswari: సీఎం జగన్‌పై జరిగిన దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది..