Ponnam Prabhakar : భవిష్యత్లో స్థానిక సంస్థలకు చాలా ప్రాధాన్యత ఇస్తాం
- పదవి బాధ్యతలు పూర్తి చేసుకున్న జడ్పీ చైర్మన్
- జడ్పీటిసి
- ఎంపిపి లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం
- ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో 2019 నుండి 2024 వరకు పదవి బాధ్యతలు పూర్తి చేసుకున్న జడ్పీ చైర్మన్, జడ్పీటిసి, ఎంపిపి లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ గణపతి, వైస్ చైర్మన్ పెరాల గోపాల్ రావు , జడ్పీటిసి, ఎంపిపి లను ఘనంగా సత్కరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. 5 సంవత్సరాలు పదవి కాలం పూర్తి చేసుకున్న జిల్లా పరిషత్ సభ్యులకు, ఎంపిపి లకు శుభాకాంక్షలు తెలిపారు. 5 సంవత్సరాల ప్రజా జీవితంలో నిధులున్నా ,లేకున్నా అనేకా కష్టాలు వచ్చినా ప్రజల సమస్యలు ఎదుర్కొనీ మంచి పేరు సంపాదించుకున్నారని, జడ్పీటిసి సభ్యునిగా మీ పదవి ముగిసినప్పటికీ ప్రజా జీవితంలో మీరు మళ్ళీ ఏదో ఒక రూపంలో ఎన్నికై ప్రజలతో ఉండాలని కోరుకుంటున్నా అని మంత్రి పొన్నం అన్నారు.
అంతేకాకుండా..’నేను గతంలో కొత్తగా సింగిల్ విండో అధ్యక్షుడు అయిన తరువాత పెద్దల ఆశీర్వాదం తో సహకార రంగంలో విజయవంతంగా పని చేశా.. కరీంనగర్ జిల్లా పరిషత్ కు మా రాజకీయ గురువు చొక్కారావు గారు గతంలో చైర్మన్ గా అయ్యారు… తరువాత చాలా మంది ఎన్నికయ్యారు.. ప్రజా సమస్యలు పరిష్కరించిన వాటికి సంతృప్తిగా తీపి గుర్తుగా ఉంటాయి.. కొన్ని పరిష్కారం కానివి ఉన్న వాటిని మళ్ళీ పరిష్కారం దిశగా పదవుల్లో ఉన్నా లేకున్నా అవి సాధించే దిశగా చర్యలు తీసుకోవాలి.. భవిష్యత్ లో స్థానిక సంస్థలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని మా ముఖ్యమంత్రి రేవంత్ గారి నేతృత్వంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.. పదవుల్లో ఉన్నన్ని రోజులు రాజకీయాలకు అతీతంగా స్నేహపూర్వకంగా ,అరోగ్యకైరమైన వాతావరణం లో పని చేశాం.. రాబోయే కాలంలో మీకు మరింత మంచి జరగాలని , భవిష్యత్ లో మరిన్ని పదవులు రావాలని కోరుకుంటున్న.. పదవి పూర్తి చేసుకున్న జడ్పీటిసి లకు శుభాకాంక్షలు తెలుపుతున్న.. రాజకీయాలకు అతీతంగా సహృద్భావ వాతావరణంలో కలిసి పనిచేస్తున్నాం.. ఏ సమస్య ఉన్న పార్టీలకు అతీతంగా ఓపెన్ గా చెప్పుకోవచ్చు.. మీరంతా భవిష్యత్ లో మరిన్ని పదవులు సాధించవచ్చు.. ప్రజా జీవితంలో మరింతగా ముందుకు పోతుండాలని కోరుకుంటున్న..’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
Also Read
తాజావార్తలు
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతోన్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!