Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ponnala Lakmaya Sensational Comments On Congress

Ponnala Lakshmaiah: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అమ్మకానికి పెట్టారు.. పొన్నాల సంచలన వ్యాఖ్యలు..

Published Date :October 13, 2023 , 2:20 pm
By Bhanu
Ponnala Lakshmaiah: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అమ్మకానికి పెట్టారు.. పొన్నాల సంచలన వ్యాఖ్యలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ponnala Lakshmaiah: కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు భూములు.. విల్లాలు ఇస్తే టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో పార్టీని అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు. వ్యాపార సంస్థగా పీసీసీ మార్చేశారని పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఖర్గేకి లేఖ రాశారు. టిక్కెట్ల కేటాయింపులో బీసీలకు పార్టీ అన్యాయం చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ టికెట్ విషయంలో పొన్నాల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి జనగామ టిక్కెట్టు ఇస్తారనే ప్రచారం జరుగుతున్న వేళ అసహనంతో పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్టీ గొప్ప సింద్ధాంతాలు రాసుకుంటామని, ఒక కుటుంబానికి ఒకటే సీటు అంటారని అన్నారు. అది అందరికీ వర్తించదని,
ఓ అనామకుడు సర్వేలు చేయడ, మీ పేరు లేదంటే మాలాంటి వాళ్ళు కూడా మౌనంగా ఉండాల్సి రావడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు పార్టీ పదవులు ఇచ్చినందుకు ధన్యవాదాలని అన్నారు. అవమానాలు పడుతూ పార్టీలో భాగస్వామ్యం అవ్వాలని అనుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో తనకు అవమానం జరిగిందంటూ పొన్నాల లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌ లో పొన్నాల చేరున్నట్లు సమాచారం. వైఎస్‌ కేబినెట్‌ లో నీటిపారుదల మంత్రిగా పొన్నాల పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలి పీసీసీ చీఫ్‌గా పొన్నాల లక్ష్మయ్య పనిచేశారు.

Read also: Infosys: ఫలితాల తర్వాత పతనమైన ఇన్ఫోసిస్ షేర్లు.. రూ. 4300 కోట్ల నష్టం

బాధతో పార్టీ కి రాజీనామా చేస్తున్నానని అన్నారు. 2014 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా పార్టీ ఓడిపోయిందని అన్నారు. కానీ నన్ను రాజీనామా చేయించి బలి పశువుని చేసింది పార్టీ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. 2018 లో కూడా పార్టీ ఒడిపోయిందని, కానీ అప్పటి నాయకులను మాత్రం రాజీనామా చేయాలని అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీలో మేము పరాయి వాళ్ళము అయ్యామని అన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడైనా కనిపించినా నమస్తే పెడితే కూడా స్పందించడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతం సామాజిక న్యాయంకి పాతర పడిందని అన్నారు. బీసీ నాయకుల టికెట్లు ఎగ్గొట్టే కుట్ర జరుగుతుందని అన్నారు. సర్వేల పేరుతో.. సీట్లు ఎగ్గొట్టే కుట్ర జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో లేని వ్యక్తులు గెలుస్తారని చెప్తున్నారు, పార్టీలో ఉన్న బీసీ నేతలు ఓడిపోయే వాళ్ళు అనే ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. నా లాంటి సీనియర్ నేత మాట్లాడాలి అంటే అపోయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని బాధపడ్డారు. బీసీ నేతలు 50 మంది వచ్చి ఏఐసీసీ అపాయింట్ మెంట్ కోరితే.. అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.
Vicky Kaushal: ఇండియాస్ బెస్ట్ బయోపిక్… టీజర్ కి సెల్యూట్ కొట్టాల్సిందే

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions