నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మసాజ్ సెంటర్ పై మల్కాజిగిరి SoT టీమ్, నేరేడ్ మెట్ పోలీసులు కలిసి దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిబంధనలకు విరుద్ధంగా నేరేడ్ మెట్ డిఫెన్స్ కాలనీలో మార్టిన్స్ వెల్నెస్ బ్యూటీ స్పా పేరుతో ఒక మసాజ్ సెంటర్ ను నిర్వహిస్తూ అందులో మహిళలతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.
నేరేడ్మెట్ పోలీసులు మల్కాజిగిరి ఎల్.ఓ.టి సహాయంతో స్పా సెంటర్ పై దాడి చేసి అందులో ఉన్న ముగ్గురు యువతులు, స్పా నిర్వాహకుడు రెడ్డి రాజేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. వారి వద్దనుండి కండోమ్ ప్యాకెట్లు, నాలుగు సెల్ ఫోన్లు, వెయ్యి రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.