మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోస్ కి చిరు సపోర్ట్… అక్కినేని ఫ్యామిలీ హీరోస్ కి ఒకప్పుడు ఏఎన్నార్ ఇప్పుడు నాగార్జున సపోర్ట్, నందమూరి ఫ్యామిలీ హీరోస్ కి ఒకప్పుడు ఎన్టీఆర్ ఇప్పుడు బాలకృష్ణ సపోర్ట్… దగ్గుబాటి ఫ్యామిలీ, ఘట్టమనేని ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ… ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి హీరో వెనక ఎదో ఒక బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా తమ సొంత ట్యాలెంట్ తోనే ఈ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన హీరోలు స్టార్ హీరోలు అయ్యారు అనేది నిజమే కానీ మొదటి అవకాశం వీరికి కాస్త ఈజీగా దొరుకుతుంది. ఒక సినిమా ఫ్లాప్ అయినా మార్కెట్ దెబ్బ తినకుండా ఇంకో అవకాశం వెంటనే వచ్చేస్తుంది. ఇది కొత్త హీరోలకి, బయట నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన మనుషులకి ఉండదు. ఇలాంటి కష్టాన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరో అయ్యే వరకూ భరించి, గెలిచి చూపించిన వాడు రవితేజ.
హిట్ ఫ్లాప్ అనే తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే రవితేజకి ఒక్క ఫ్లాప్ పడితే చాలు రవితేజ పని అయిపొయింది అనే కామెంట్స్ వినిపిస్తాయి. ఇలాంటి కామెంట్స్ మిగిలిన ఏ స్టార్ హీరో గురించి కూడా వినిపించవు. విమర్శలు వచ్చిన ప్రతిసారీ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చే రవితేజ… పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ టైగర్ నాగేశ్వరరావు సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూస్ ఇస్తున్న రవితేజ, నార్త్ లో ఒక ఇంటర్వ్యూలో యష్ గురించి మాట్లాడుతూ… “అతను చాలా లక్కీ, KGF సినిమా అతనికి పడింది” అనే మాట అన్నాడు. ఈ మాటని పట్టుకోని కన్నడ యష్ ఫ్యాన్స్… యష్ లక్కీ కాదు, తను ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకున్నాడు అంటూ కష్టం గురించి రవితేజకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్టీఆర్ కి అదుర్స్ పడినట్లు, రామ్ చరణ్ కి రంగస్థలం పడినట్లు, అల్లు అర్జున్ కి పుష్ప పడినట్లు, ప్రభాస్ కి బాహుబలి పడినట్లు… యష్ కి KGF లాంటి సినిమా పడింది, అలాంటి సినిమా చేయాలంటే అదృష్టం ఉండాలి, ఆ విషయంలో యష్ లక్కీ అనే సెన్స్ లో రవితేజ మాట్లాడితే దాన్ని అర్ధం చేసుకోకుండా కొందరు రవితేజపై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆడియన్స్ తో మాస్ మహారాజా అని పిలుచుకునే స్థాయికి ఎదిగిన రవితేజకి రవితేజనే బ్యాక్ గ్రౌండ్. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి… ఎవరూ లేకపోయినా ఇండస్ట్రీలోకి వచ్చి మనం ఎదో ఒకటి పీకోచ్చు అని నమ్మే అయ్యే ప్రతి ఒక్కరికీ రవితేజ ఒక ఇన్స్పిరేషన్. సినిమా కష్టం గురించి అందరికన్నా ఎక్కువగా తెలిసినోడు రవితేజ, ఇంకొకరి కష్టాన్ని అంత తేలిగ్గా తీసిపారేయడు.