ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు వెలుగు లోకి వచ్చాయి. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు నాగేశ్వరరావు చేయని ప్రయత్నాలు లేదని విచారణలో బయటపడింది. మరోవైపు కేసుకు సంబంధించి రాచకొండ పోలీసులు పక్కాగా ఆధారాలు సేకరిస్తున్నారు. దీనికి తోడు బాధితురాలు ఇల్లుతో పాటుగా రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ ని ఇప్పటికే అధికారులు తెప్పించుకున్నారు. సంఘటన జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు నాగేశ్వరరావు ఎక్కడ ఉన్నారు? ఏంటి అనే విషయాన్ని పోలీసులు పూర్తిగా గా తెలుసుకుంటున్నారు. మరోవైపు అనతికారికంగా నాగేశ్వరరావు టవర్ లొకేషన్స్ తెప్పించుకోవడం పైన కూడా పోలీస్ శాఖ విచారణ చేస్తోంది. బాధితురాలు భర్తకు సంబంధించిన టవర్ లొకేషన్స్ నాగేశ్వరరావు ఎప్పటికప్పుడు తెప్పించుకున్నాడు. నాగేశ్వరరావు వ్యవహారానికి సంబంధించి పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. సంఘటన జరిగిన తర్వాత నాగేశ్వరరావు ఎక్కడికి వెళ్లాడు. ఎవరికి కలిశారు .ఈ కేసు సంబంధించి ఏమైనా తారుమారు చేసే ప్రయత్నం చేశాడా అనే దానిమీద సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
ఈనెల 7వ తేదీ రాత్రి 9:30 గంటల ప్రాంతంలో నాగేశ్వరరావు బాధితురాలు ఇంటికి వెళ్ళాడు. హస్తినాపురంలోని బాధితురాలు ఇంటికి వెళ్లి తలపై తుపాకి పెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదే సమయంలో బయటికి వెళ్లిన బాధితులు భర్త ఇంటికి రావడం జరిగింది. బాధితురాలు భర్తపై నాగేశ్వరరావు దాడి చేసే ప్రయత్నం చేశారు .అయితే బాధితురాలు భర్త వెంటనే చేరుకొని నాగేశ్వర్ పైన దానికి పాల్పడ్డాడు. ఈ ఘర్షణలో నాగేశ్వరరావు ఏకంగా తుపాకిని ఎక్కిపెట్టి చంపేస్తానని బెదిరించాడు. ఆమె భర్తను ఇంట్లో మోకాళ్ళ మీద గంటల తరబడి కూర్చోబెట్టాడు. తర్వాత ఇద్దరిని తీసుకుని ఇబ్రహీంపట్నం వైపు వెళుతుంటే రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదం సంబంధించి ఇబ్రహీంపట్నంలో ఒక కేసు నమోదయింది. ప్రమాదం నుంచి బయటపడ్డ బాధితులు ఇద్దరు నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. అదేరోజు రాత్రి సమయంలో వనస్థలిపురం పోలీస్ స్టేషన్ వెళ్లి బాధిత మహిళతోపాటు భర్త నాగేశ్వరరావు పైన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు అయిన వెంటనే వనస్థలిపురం పోలీసులు నాగేశ్వరావుని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అప్పటికి నాగేశ్వరరావు మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో వనస్థలిపురం పోలీసులు రావడం జరిగింది. అయితే తాను నైట్ డ్యూటీలో ఉన్నానని, తప్పనిసరిగా ఉదయం వరకు ఉండాల్సిన అవసరం ఉందని, తాను ఇప్పుడు విచారణకు హాజరు కాలినని, రేపు ఉదయం వచ్చి విచారణకు హాజరవుతానని నాగేశ్వరరావు పోలీసులకు చెప్పాడు. ఈ సమాధానంతో సంతృప్తి చెందిన పోలీస్ అధికారులు వెంటనే నాగేశ్వరరావుని వదిలేసి వెళ్లిపోయారు.
Maharashtra: సుప్రీం కోర్టులో ఉద్ధవ్ ఠాక్రేకు ఎదురు దెబ్బRead Also:
అయితే ఇక్కడే కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఒక సీరియస్ క్రైమ్‌లో నిందితులుగా ఉన్న వాళ్లని పోలీస్ అధికారులు ఇలా వదిలేసి వెళ్లిపోరు. కానీ నాగేశ్వరావుని మాత్రం పోలీసులు వదిలేసి వెళ్లిపోయారు. ఎక్కడికి వెళ్లకుండా ఉండేందుకు తప్పనిసరిగా అతనిపైన నిగా పెట్టవలసి ఉంటుంది. కానీ వనస్థలిపురం పోలీసులు నిఘా కూడా పెట్టకుండా వదిలేసి వెళ్లిపోయారు. వనస్థలిపురం పోలీసులు బయటికి బయటికి వెళ్లిపోగానే 12. 15 నిమిషాల్లో నాగేశ్వరరావు జంప్ అయ్యాడు . అర్ధరాత్రి 12 నిమిషాల సమయం లో తన సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకుని అక్కడి నుంచి పారిపోయాడు.. గత రెండు రోజుల నుంచి నాగేశ్వరరావు కనిపించకుండా పోయాడు . మరోవైపు నాగేశ్వరరావుని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు . రెండు రోజుల తర్వాత నాగేశ్వరరావు రాచకొండ పోలీస్ అధికారులకు టచ్ లోకి వచ్చాడు. ఇప్పటికే నాగేశ్వరరావు రాచకొండ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టుగా సమాచారం . అయితే రాచకొండ పోలీసులు ఇంకా అధికారికంగా నాగేశ్వరరావు అరెస్టుకు సంబంధించి సమాచారాన్ని పేర్కొనలేదు. తనను వెంటనే కోర్టులో హాజరు పరిచారని చెప్పాడు. . రెండు రోజులపాటు నాగేశ్వరరావు అజ్ఞాతంలోని ఉండిపోయాడు. ఇదిలా ఉంటే బాధితురాలు సంబంధించిన స్టేట్మెంట్ ని పోలీసులు రికార్డు చేశారు .బాధితురాలు భర్త స్టేట్మెంట్ ని కూడా పోలీసులు రికార్డ్ చేశారు.
మరోవైపు సంఘటన జరిగిన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలతో పాటుగా రోడ్డు ప్రమాదానికి గురైన ప్రాంతంలో దొరికిన ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. తనను గత కొంతకాలం నుంచి నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో వేధింపులకు గురి చేస్తున్నారని, అంతేకాకుండా తనను మానసికంగా శారీరకంగా తీవ్ర స్థాయిలో చిత్రం గురి చేశారని బాధితురాలు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది తనను భయపెట్టి బలవంతం చేసి బలత్కారానికి పాల్పడ్డాడని చెప్పింది. తుపాకీని గురిపెట్టి బలవంతంగా అత్యాచారానికి నాగేశ్వరరావు పాల్పడ్డాడని బాధితురాలు స్టేట్‌మెంట్ ఇచ్చింది. తనను నాగేశ్వరరావు మానసికంగా చాలా కాలం నుంచి ఇబ్బందులకు గురి చేసినప్పటికీ భర్తకు చెప్పలేదని, తన భర్తకు విషయం చెప్తే చంపేస్తానని నాగేశ్వరరావు బెదిరించినట్లుగా బాధ్యత మహిళా స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఇదిలా ఉంటే నాగేశ్వరరావుని అరెస్టు చేయడంలో పోలీసు అధికారులు టార్చర్ చేస్తున్నారంటూ బిజెపి కాంగ్రెస్ పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. 24 గంటల్లోగా నాగేశ్వరరావుని అరెస్టు చేయకపోతే అన్ని పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.