విద్యుత్ శాఖలో జూనియర్ లైన్‌మెన్ల నియామక పరీక్షలో జరిగిన అక్రమాలపై పోలీసులు దృష్టి కేంద్రీకరించాయి. జూలై 17న జరిగిన రాత పరీక్షలో కొందరు అభ్యర్థులకు సెల్‌ఫోన్ ద్వారా సమాధానాలు రాయడాన్ని ఘట్‌కేసర్ లోని ఓ పరీక్షకేంద్రం అధికారి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయండో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరాతీయగా నిజాల తెలిసి ఖంగుతున్నారు. అక్కడ సెల్‌ఫోన్ పరీక్ష రాసింది ఒక్కరేకాదు పదుల సంఖ్యలో అభ్యర్థులు సెల్‌ఫోన్ల ద్వారా సమాధానాలు వెల్లినట్లు…