TS TET 2022: నేడే టెట్.. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ టెట్) ఆదివారం జరుగనున్నది. ఇందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత టెట్ జరుగడం ఇది మూడోసారి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే పేపర్-1 కు 3,51,468 మంది, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే పేపర్-2 పరీక్షకు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నారు.
టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటయ్యేలా మార్పులు చేయడంతో బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయనున్నారు. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన అభ్యర్థులు టెట్ ఉత్తీర్ణత ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులవుతారు. పేపర్-2 రాయడం ద్వారా బీఈడీ అభ్యర్థులు సూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత పొందుతారు. ఈ సారి పేపర్-2 రాసే వారు కూడా పేపర్-1 రాసి, ఎస్టీటీలుగా అర్హత పొందేలా మార్పులు చేశారు. దీంతో పేపర్-1కు భారీగా దరఖాస్తులు వచ్చాయి.
Also Read
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
టెట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 212, ములుగులో అతి తకువగా 15 పరీక్ష కేంద్రాలు పెట్టారు. ప్రతి పరీక్ష కేంద్రంలో పటిష్ఠ నిఘా ఏర్పాటుచేశారు. అన్నిచోట్ల సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. వీటిని ఇంటర్నెట్ ద్వారా జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేశారు. పరీక్ష ప్రారంభం నుంచి ముగిసే వరకు వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీనిని ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు.
TS-TET 2022
మొత్తం 33 జిల్లల వారిగా రెండు సెషన్‌లలో పరీక్ష నిర్వహించనున్నారు.
పేపర్ – I – ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.00 వరకు.
పేపర్ – II – మధ్యాహ్నం 2.30 ని. నుంచి 5.00 వరకు.
రాష్ట్రంలోని 2,683 కేంద్రాలు కాగా.. 6,29,352 మంది అభ్యర్థులు వున్నారు.
పేపర్ – I కు 1480 కేంద్రాల్లో 3,51,468 అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.
పేపర్ – II కు 1203 కేంద్రాల్లో 2,77,884 అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు.
ఖాళీలుః
1. చీఫ్ సూపరింటెండెంట్ల సంఖ్య – 1480
2. డిపార్ట్‌మెంటల్ అధికారుల సంఖ్య – 1480
3. హాల్ సూపరింటెండెంట్ల సంఖ్య – 13415
4. ఇన్విజిలేటర్ల సంఖ్య – 29513
5. ఫ్లయింగ్ స్క్వాడ్స్ / రూట్ ఆఫీసర్ల సంఖ్య – 252
వసతులుః
1. పరీక్షా కేంద్రాలలో ఒక ANM
2. అవసరమైన వైద్య సహాయం అందించడానికి..
3. ORS ప్యాకెట్లు , ఇతర ప్రథమ చికిత్స మందులను వైద్య శాఖ అవసరమైన చర్య తీసుకుంది.
4. అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోవడానికి వీలుగా పరీక్షా కేంద్రాల రూట్లలో ఆర్టీసీ ప్రత్యేక
బస్సులను ఏర్పాటు చేసింది.
5. పరీక్షా కేంద్రాలకు పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేయడంతోపాటు స్టోరేజీ పాయింట్ల వద్ద బందోబస్తు ఏర్పాటు
చేశారు.
పరీక్ష సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి పరిశీలకులను నియమించారు. వసతి, ఫర్నీచర్, చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాలు, నిరంతర విద్యుత్ సరఫరా తదితర అన్ని ఏర్పాట్లు జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారులు పరీక్షా కేంద్రాల నిర్వహణ చేశారు.
సూచనలుః
పరీక్ష రోజు కేంద్రానికి చేరుకోవడంలో ఆలస్యం జరగకుండా ఉండేందుకు అభ్యర్థులు పరీక్ష రోజుకి ఒకరోజు ముందు సెంటర్ చిరునామాను తెలుసుకోవాలి. అభ్యర్థులు పరీక్ష షెడ్యూల్‌కు కనీసం ఒక గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. అభ్యర్థులు కేటాయించిన కేంద్రంలో మాత్రమే పరీక్ష రాయడానికి అనుమతించబడతారు. అభ్యర్థులు (02) బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులు మరియు హాల్ టికెట్ తీసుకురావాలి. మొబైల్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, బ్యాగ్‌లు మొదలైనవాటిని కేంద్రంలోకి అనుమతించరు.
జాగ్రత్తలు:
TSTET-2022కి హాజరయ్యే అభ్యర్థులు హాల్ టిక్కెట్‌పై ముద్రించిన సూచనలను జాగ్రత్తగా చదవాలి. ముందుగా ముద్రించిన OMR షీట్‌లో అందించిన సర్కిల్‌లను షేడ్ చేయడానికి బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను ఉపయోగించాలి. OMR షీట్‌ను మడవకండి, చింపివేయవద్దు, ముడతలు పడొద్దు, స్టేపుల్ చేయకూడదు. సైడ్-IIలో బార్‌కోడ్ మరియు బ్లాక్ రిఫరెన్స్ పాయింట్‌ను తారుమారు చేయవద్దు. OMR షీట్‌లో అందించిన తగిన పెట్టె వద్ద బుక్ లెట్ కోడ్‌ను షేడ్ చేయండి, లేకుంటే సమాధానాలకు విలువ ఇవ్వబడదు మరియు సమాధానం ఇవ్వబడనట్లుగా పరిగణించబడుతుంది. ప్రశ్నకు సమాధానమివ్వడం కోసం OMR షీట్‌లో అందించిన సర్కిల్‌ను పూర్తిగా షేడ్ చేయండి. లేకపోతే సమాధానం చెల్లదు.
తాజావార్తలు
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Hyderabad: ఉప్పల్‌లో మ్యాచ్‌కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!