Constable final exam: తెలంగాణలో ఏప్రిల్ 30న పోలీస్ కానిస్టేబుల్ (సివిల్ అండ్ టెక్నికల్) పోస్టులకు తుది పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కానిస్టేబుల్ (సివిల్) పోస్టులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, కానిస్టేబుల్ (ఐటీ & సీఈఓ) పోస్టులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు సూచించారు. పరీక్ష ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. సివిల్, టెక్నికల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లపై తప్పనిసరిగా పాస్‌పోర్టు సైజు ఫోటోగ్రాఫ్‌ను అతికించాలని, లేకుంటే పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేసింది.
Read also: Online scams: అత్యాశకు పోయాడు.. 12లక్షలు పోగొట్టుకున్నాడు
పరీక్ష విధానం:
➨ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రధాన పరీక్ష నిర్వహిస్తారు.
➨ సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 200 మార్కుల పరీక్ష ఉంటుంది.
➨ APSP కానిస్టేబుల్ పోస్టులకు 100 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కు 100 మార్కులు కేటాయిస్తారు.
అభ్యర్థులకు కీలక సూచనలు..
➥ A4 సైజు పేపర్లో హాల్ టిక్కెట్‌ను ప్రింట్ తీసుకొని, అదే ఫోటోను డిజిటల్ కాపీగా పేర్కొన్న స్థలంలో దరఖాస్తు సమయంలో అతికించండి. గమ్‌తో మాత్రమే అతికించండి.
➥ అభ్యర్థులు తమ చేతులపై మెహందీ మరియు పచ్చబొట్లు ఉంచుకోకూడదు.
➥ మహిళా అభ్యర్థులు నగలు ధరించకూడదు. OMR షీట్లలో అనవసరమైన రాతలు, చిహ్నాలు, మతపరమైన అంశాలు మొదలైనవి మాల్‌ప్రాక్టీస్‌గా పరిగణించబడతాయి.
➥ అభ్యర్థి హాల్ టికెట్‌తో పాటు బ్లూ మరియు బ్లాక్ పాయింట్ పెన్ను మాత్రమే పరీక్ష హాల్లోకి తీసుకెళ్లాలి.
➥ అభ్యర్థులు సెల్ ఫోన్, టాబ్లెట్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ పరికరం, చేతి గడియారం, కాలిక్యులేటర్, లాగ్ టేబుల్, వాలెట్, పర్సు నోట్లు, ఛార్జ్, రికార్డింగ్ పరికరాలు, ఖాళీ పేపర్లు తీసుకురాకూడదు.
➥ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తయ్యే వరకు హాల్ టిక్కెట్‌ను సురక్షితంగా ఉంచండి.
➥ హ్యాండ్‌బ్యాగ్‌లు, పౌచ్‌లు వంటి వస్తువులను పరీక్ష హాలులోకి తీసుకెళ్లకూడదు.
Heavy Rainfall: తెలంగాణలో జిల్లాలకు ఎల్లో అలర్ట్.. రోజంతా భారీ వర్షాలు కురిసే అవకాశం