మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీ నేతలు, కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కరీంనగర్ లో హాట్ కామెంట్స్ చేశారు ఎర్రబెల్లి. నాకు ఇద్దరే ఇద్దరు ఇష్టం. పేదల గురించి ఆలోచించింది ఎన్టీఆర్ కేసీఆర్ లే. కర్ణాటకలో ఓ వృద్ధురాలిని అడిగాను.. బీజేపీ ప్రభుత్వం 500 ఇస్తుందని చెప్పారు.. రెండు వేల మంది ఉంటే 20 మందికి వస్తున్నాయి.. తెలంగాణలో ఒక్క వెలిచాల గ్రామంలోనే 780 మందికి పింఛన్లు వస్తున్నాయిజ బండి సంజయ్ దుమ్ము లేపుతా అంటాడు.. ప్రధాని మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్ లో పెన్షన్ ఎంత వస్తుంది? చెప్పాలన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే తక్కువ పెన్షన్ లున్నాయి.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆరు గంటల కరెంట్ మాత్రమే వస్తుంది. పైగా మోటార్లకు మీటర్లు పెడుతున్నారు. ఒక్కొక్క మోటార్ కు లక్ష రూపాయలు బిల్లు వస్తుంది పెడదామా? నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ మోటార్ లకు మీటర్లు పెట్ట నివ్వం అని కేసీఆర్ మోడీకి చెప్పారు. మేము కూడా ఇస్తాం అని బండి సంజయ్ అంటున్నారు.. వాళ్లు ఇచ్చేది రెండు వేలే.. కేసీఆర్ 10 వేలు ఇస్తున్నారు. బీజేపీ నాయకులు దొంగలు దుర్మార్గులు.
Read Also: Tammareddy Bharadwaja: కృష్ణంరాజు గురించి మాట్లాడాలంటే నాకు సిగ్గుగా ఉంది
ఇదే పాదయాత్ర దమ్ముంటే కర్ణాటక లో ఉత్తర ప్రదేశ్ లో చేద్దాం రండి అని సవాల్ విసిరారు మంత్రి ఎర్రబెల్లి. తెలంగాణలోని పథకాలు అక్కడి పథకాలు సమానంగా ఉంటే ఎక్కువ లబ్ది ఉంటే నేను గులాం గిరీ చేస్తా. బండి సంజయ్ తుపాకీ రామునిలా మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీ తెచ్చుకోలేని దద్దమ్మ బండి సంజయ్ అని ఎద్దేవా చేశారు. బీజేపీ మతతత్వ పార్టీ . బీజేపీ వల్ల దేశం నాశనం అవుతుందని ఆరోపించారు ఎర్రబెల్లి. రాష్ట్రానికి రావలసిన నిధులు ఇవ్వడం లేదని కేంద్రంపై మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి.