Podu Lands Row: ఎటూ తెగని పోడు భూముల లొల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోడు భూముల లొల్లిఎటూ తెగడం లేదు. భూమే తమకు ఆధారం అని ఆదివాసీలంటుంటే అసలు అక్కడ పోడు భూమే లేదంటున్నారు అటవీశాఖ అధికారులు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా తిరిగొచ్చాక సైతం ఆదివాసీలు భూమి కోసం ఆరాటపడుతుంటే అధికారులు అది కవ్వాల్ టైగర్ జోన్ అంటూ ఖరాకండిగా చెప్పేస్తున్నారు. ఎంత చేసినా ఎట్టి పరిస్థితుల్లో భూమి ఇవ్వబోమని అటవీశాఖ తేల్చి చెబితే.. .తాము ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని వదల బోమంటున్నారు ఆదివాసీలు..మంచిర్యాల జిల్లా కోయపోష గూడెంలో పోడు పోరు హాట్ టాపిక్ అవుతోంది.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్ల రేంజ్ పరిధిలోని కోయపోష గూడెంలో అడవిని నరికేస్తున్నారని అటవీశాఖ అధికారులు 12 మంది మహిళలను అరెస్ట్ చేసారు. కోర్టు ముందు ప్రవేశ పెట్టగా వారిని జైల్ కు సైతం పంపారు. జైల్ కు వెళ్ళిన ఆదివాసీ మహిళలు రెండు రోజుల క్రితం బెయిల్ పై విడుదలై గ్రామానికి చేరుకున్నారు. అయితే తమకు భూమే ఆధారం ..ఎట్టి పరిస్థితుల్లో తాము పోడు చేసుకుంటున్న భూమిని వదిలిపెట్టబోమంటున్నారు.
Also Read
అయితే గ్రామానికి వెళ్ళిన అధికారులు ఆదివాసీలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కాని ససేమిరా అన్నారు. తాము ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం. భూమి తమకే కావాలంటుండగా అధికారులు మాత్రం అక్రమంగా అడవిలోకి చొరబడి 8హెక్టార్ల లో అడవిని ఈమధ్యనే నరికారని మంచిర్యాల డీఎఫ్ ఓ తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె ఇన్నాళ్ల పాటు ఎవ్వరు పోడు చేయలేదని ఏడాది క్రితం నుంచే ఆదివాసీలు కోయపోషగూడెం శివారులో అడవిని నరికారని తామెవ్వరికీ ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలివ్వలేదని స్పష్టం చేశారు. ఎవరెన్ని చేసినా ఆదివాసీలకు ఆభూమి రాదని తేల్చారు.
భూమి దక్కదు, ఇవ్వమని అధికారులు అంటుంటే ఆదివాసీలు మాత్రం తమకు తిండి సైతం లేదని ఆధారమైన భూమికోసం మరోసారి జైల్ కు సైతం వెళ్తామని చెప్పేస్తున్నారు ఆదివాసీలు. ఎన్నికేసులు పెట్టినా తాము భూమి వదిలి వెళ్ళబోమంటున్నారు. భూమి తమకు వచ్చే వరకు పోరాటం ఆపబోమని అప్పటివరకు ఇక్కడే ఉంటామంటున్నారు ఆదివాసీ మహిళలు. వీటన్నింటిపై జిల్లా అధికారులు ఆదివాసీలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఐటీడీఏ పీఓ సైతం ఆదివాసీలతో మాట్లాడారు..భూమి హక్కు పత్రాలకోసం ఆదివాసీలు పట్టుబడుతుంటే అధికారులు మాత్రం అసలు పోడే లేదంటున్నారు. గతంలో తమకే భూమి చెందుతుందన్న అధికారులు..ఇప్పుడు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆదివాసీ సంఘాల నాయకులు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!