యంగ్ హీరోయిన్ శ్రీలీలా ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ. ధమాకా సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న శ్రీలీలా, తన గ్లామర్ అండ్ డాన్స్ తో యూత్ ని మెస్మరైజ్ చేస్తోంది. శ్రీలీల ప్రస్తుతం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. గుంటూరు కారం సినిమాలో పూజ హెగ్డే స్థానంలో మెయిన్ హీరోయిన్ గా మారిన శ్రీలీల ఇద్దరు హీరోలకి షాక్ ఇచ్చిందని సమాచారం. విజయ్ దేవరకొండతో శ్రీలీల ఒక సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చిన ఆ మూవీ నుంచి శ్రీలీల తప్పుకుందని టాక్. డేట్స్ అడ్జస్ట్ చేయలేక శ్రీలీల విజయ్ దేవరకొండ సినిమా నుంచి అవుట్ అయ్యిందట. ఈ ప్రాజెక్ట్ తో పాటు మాస్ మహారాజ రవితేజతో చేయాల్సిన ఒక సినిమా నుంచి కూడా శ్రీలీల వెళ్లిపోయిందట.
ధమాకా కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ సెట్ అయిన ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా డేట్స్ క్లాష్ విషయంలోనే శ్రీలీల అవుట్ అయ్యే డెసిషన్ తీసుకుందట. అన్నేసి సినిమాలని బ్యాక్ టు బ్యాక్ ఒప్పుకోవడం ఎందుకు? తీరా షూటింగ్ సమయానికి వచ్చే సరికి డేట్స్ అడ్జస్ట్ చేయలేను అంటూ సైడ్ అయిపోవడం ఎందుకు అనే కామెంట్స్ శ్రీలీలపై స్టార్ట్ అయ్యాయి. అయితే ఒక సినిమా నుంచు అవుట్ అవ్వాలి అంటే… డేట్స్ ఇచ్చే విషయంలో క్లాష్ రావడం, షూటింగ్ డిలే అవ్వడం, ఒకే సమయానికి రెండు మూడు సినిమాల షూటింగ్స్ జరుగుతుంటే మేనేజ్ చేసుకోలేకపోవడం లాంటి ఇష్యూస్ ఉంటాయి. కారణాలు ఏవైనా సరే శ్రీలీల ప్రస్తుతం విజయ్ దేవరకొండ అండ్ రవితేజతో చేయాల్సిన సినిమాల నుంచి అయితే తప్పుకుంది.