PM Modi: నేడు వరంగల్ లో మోడీ పర్యటన.. వేములవాడ స్వామివారికి ప్రధాని ప్రత్యేక పూజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: రాజన్నసిరిసిల్ల జిల్లా పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు వేములవాడ, రాజన్న సిరిసిల్లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మద్దతుగా మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో వేములవాడకు బయలుదేరుతారు. వేములవాడ రాజన్నకు కోడేమొక్కులు చెల్లించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం కోర్టు పక్కన గల మైదానంలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. గుడి చెరువులో హెలిప్యాడ్ ను అధికారులు సిద్ధం చేశారు. 1200 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో వేములవాడ నుంచి ఉదయం 11.05 గంటలకు బయలుదేరుతారు. ఉదయం 11.45 గంటలకు మామునూర్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఉదయం 11.55 గంటలకు బహిరంగ సభ వేదికపైకి చేరుకుని.. మధ్నాహ్నం 12 నుంచి 12.50 వరకు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్నాహ్నం 12.55 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరుతారు.
Read also: పుష్ప తో నా క్రేజ్ ఏం పెరగలేదు..ఫహాద్ షాకింగ్ కామెంట్స్…
Also Read
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్ల ద్వారానే..
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
అనంతరం వరంగల్ లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్నారు. ఉదయం 10.00 గంటలకు వేములవాడ నుండి హెలికాప్టర్ లో మామునూరుకు చేరుకుంటారు. ఆ పక్కనే ఉన్న లక్ష్మీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రధాన మంత్రి మోడీ పర్యటన సందర్భంగా బీజేపీ వర్గాలు భారీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వరంగల్ జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
Read also: DC vs RR: తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించిన యుజ్వేంద్ర చహల్!
నేడు ప్రధాని మోడీ మధ్యాహ్నం 3.35 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి ఎయిర్‌పోర్టుకు బయలు దేరనున్నారు. తిరుపతి నుంచి హెలికాప్టర్‌లో రాజంపేట కలికిరికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు కలికిరిలో ప్రధాని మోడీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 5.20 గంటలకు హెలికాప్టర్‌లో తిరుపతి ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ బయలు దేరనున్నారు. అనంతరం సాయంత్రం 6.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు రోడ్డు మార్గాన బందర్ రోడ్డు ఇందిరా గాంధీ స్టేడియంకు బయలు దేరనున్నారు. స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు గంటసేపు ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం గన్నవరం నుంచి ఢిల్లీకి ప్రధాని మోడీ పయనం కానున్నారు.
DC vs RR: తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించిన యుజ్వేంద్ర చహల్!
తాజావార్తలు
-
Tollywood: దసరా వార్లో నైజాంను క్లీన్ స్వీప్ చేసిన మైత్రీ!
-
Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
-
Varanasi: గ్లోబల్ హిస్టరీ క్రియేట్ చేసిన ‘వారణాసి’.. హాలీవుడ్ దిగ్గజాలే షాక్!
-
AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
-
Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..