PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్‌లో మోడీ సందడి.. పర్యటన మినిట్‌ టూ మినిట్‌ అప్డేట్స్‌..!

  • బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోడీ
  • హెచ్‌ఐసీసీలో భారీ ప్రాజెక్టులకు వర్చువల్ శంకుస్థాపనలు
  • సింధు ఆసుపత్రి ప్రారంభం.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని
  • పరేడ్ గ్రౌండ్స్ సభకు భారీ ఏర్పాట్లు.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
Modi Tour

Modi Tour

PM Modi Hyd Tour Live Updates : ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌ చేరుకున్నారు. షెడ్యూల్ కంటే 30 నిమిషాలు ఆలస్యంగా బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు రాష్ట్ర నాయకులు, బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీకి చేరుకున్న ప్రధాని.. వర్చువల్ విధానంలో రూ. 9,400 కోట్ల విలువైన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు కొత్తగా నిర్మించిన సింధు ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో బేగంపేట నుంచి హైటెక్ సిటీ వరకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించగా, ఈ కార్యక్రమాల అనంతరం ఆయన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే భారీ బహిరంగ సభకు హాజరవుతారు. మోడీ పర్యటనకు సంబంధించి మినిట్ టూ మినిట్ అప్డేట్స్ మీకోసం..

The liveblog has ended.
  • 10 May 2026 07:41 PM (IST)

    దీపాలు కొంటే స్వదేశీని ప్రోత్సహించినట్లు భ్రమల్లో ఉండొద్దు. -ప్రధాని మోడీ

    వ్యవసాయంలో డీజిల్‌కు బదులు సౌర పంపులను ప్రోత్సహిస్తున్నాం. వ్యవసాయంలో స్వదేశీ వస్తువులను ఎక్కువగా వినియోగించుకోవాలి. నేను స్వదేశీ గురించి చెప్పగానే దీపావళి దీపాలు గురుంచి మాట్లాడుతారు. దీపాలు కొంటే స్వదేశీని ప్రోత్సహించినట్లు భ్రమల్లో ఉండొద్దు. -ప్రధాని మోడీ

  • 10 May 2026 07:35 PM (IST)

    ఏడాదిపాటు బంగారం కొనడం తగ్గించుకోవాలి -మోడీ

    కనీసం ఏడాది పాటు విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలి. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలి. ఏడాదిపాటు బంగారం కొనడం తగ్గించుకోవాలి. వంట నూనెల వినియోగాన్ని తగ్గించుకోవాలి. విదేశాల నుంచి భారీగా రసాయన ఎరువులను దిగుమతి చేసుకుంటున్నాం. రసాయన ఎరువుల వల్ల భూమికి చాలా నష్టం జరుగుతుంది. రసాయన ఎరువులను తగ్గించుకుంటే విదేశీ ద్రవ్యాన్ని మిగిలించుకోగలం. -ప్రధాని మోడీ

  • 10 May 2026 07:29 PM (IST)

    మావోయిస్టులు తమ అంతిమ శ్వాసను లెక్కబెట్టుకుంటున్నారు -మోడీ

    కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు మావోయిస్టులకు అండగా ఉన్నాయి. మావోయిస్టులు తమ అంతిమ శ్వాసను లెక్కబెట్టుకుంటున్నారు. మావోయిస్టులపై చర్యలు తీసుకోడానికి కాంగ్రెస్‌ ముందుకు రాలేదు. తెలంగాణ పోలీసులకు ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చి ఉంటే మావోయిస్టులను అణిచివేసేవారు. ఇప్పుడు తెలంగాణ మావోయిస్టురహితంగా మారుతోంది. యుద్ధం కారణంగా ఇంధనం సంక్షోభం వచ్చింది. అయినా ఇంధనం రేట్లు పెంచడం లేదు. పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని తగ్గించాలి. మెట్రో సేవలను వాడుకోవాలి. ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించుకోవాలి. -ప్రధాని మోడీ

  • 10 May 2026 07:24 PM (IST)

    కాంగ్రెస్‌ విద్వేష రాజకీయాలను రెచ్చగొడుతోంది -మోడీ

    కాంగ్రెస్‌ విద్వేష రాజకీయాలను రెచ్చగొడుతోంది. కాంగ్రెస్‌ MMCగా మారింది. MMC అంటే ముస్లిం లీగ్‌ మావోవాది కాంగ్రెస్‌. మావోయిస్టులతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారు. -ప్రధాని మోడీ

  • 10 May 2026 07:14 PM (IST)

    బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ కుటుంబ పార్టీలే -మోడీ

    బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ కుటుంబ పార్టీలే. దేశంలో 14 ఇండస్ట్రియల్‌ కారిడార్ల పనులు జరుగుతున్నాయి. అందులో ఒకటి జహీరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాం. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. కాంగ్రెస్‌ ఎక్కడున్నా ఒకటే మోడల్‌. ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇస్తారు. ఆ తర్వాత సాకులు వెతుకుతారు. తెలంగాణలో కూడా ఇదే జరుగుతోంది. -ప్రధాని మోడీ

  • 10 May 2026 07:09 PM (IST)

    టీఎంసీ తానాషాహీ మోడల్‌తో ప్రజలను ఇబ్బంది పెట్టింది -మోడీ

    టీఎంసీ తానాషాహీ మోడల్‌తో ప్రజలను ఇబ్బంది పెట్టింది. బెంగాల్‌ ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛావాయువు పీల్చుకుంటున్నారు. పదేళ్ల క్రితం బెంగాల్‌లో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉండేవారు. ఇప్పుడు 200 మందికి పైగా బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు. మొదట్లో బీజేపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండేవారు, అందులో ఒకరు తెలంగాణ వ్యక్తి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా భారీ మెజార్టీతో గెలుస్తాం. -ప్రధాని మోడీ

  • 10 May 2026 07:04 PM (IST)

    బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో బానిస సంకెళ్లు తొలిగాయి. -ప్రధాని మోడీ

    అసోంలో బీజేపీ హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. పుదుచ్చేరిలో NDA రెండోసారి అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో అందరి నోట ఒకటే మాట వినిపిస్తోంది. తెలంగాణలో కూడా బీజేపీ సర్కార్‌ ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి ఏటా దేశంలో ఏదో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో కొందరు గెలుస్తారు, కొందరు ఓడుతారు. కానీ ఈ సారి జరుగుతున్న చర్చ ఎప్పుడూ జరగలేదు. బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో బానిస సంకెళ్లు తొలిగాయి. -ప్రధాని మోడీ

  • 10 May 2026 06:59 PM (IST)

    తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

    తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ. నా ప్రియమైన తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. నిన్న బెంగాల్‌కు వెళ్లాను. బెంగాల్‌లో తొలిసారి బీజేపీ సీఎం ప్రమాణస్వీకారం చేశారు. భారీ మెజార్టీతో బెంగాల్‌లో బీజేపీ గెలిచింది. బెంగాల్‌ విజయోత్సవం తెలంగాణలో కనిపిస్తోంది. -ప్రధాని మోడీ

  • 10 May 2026 06:41 PM (IST)

    బహిరంగ సభకు ప్రధాని మోడీ

    HYD: పరేడ్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభకు ప్రధాని మోడీ. పార్టీ బహిరంగ సభలో ప్రసంగించనున్న ప్రధాని మోడీ.

  • 10 May 2026 06:41 PM (IST)

    బీసీలు, విద్యార్థులు, దళితులకు కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిచింది. -కిషన్‌ రెడ్డి

    21 రాష్ట్రాల్లో NDA కూటమి అధికారంలో ఉంది. తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలిచాం. రెండు ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకున్నాం. ఒక కుటుంబం చేతిలో 10 ఏళ్లు తెలంగాణ బందీ అయ్యింది. తెలంగాణ ఆగమవుతుంది. అప్పుల పాలవుతోంది. బీజేపీ ఏం తెచ్చిందని అడుగుతున్నారు. మీలాగా అబద్ధాల గ్యారంటీలు ఇవ్వం. బీసీలు, విద్యార్థులు, దళితులకు కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిచింది. -కిషన్‌ రెడ్డి

  • 10 May 2026 06:23 PM (IST)

    చంద్రబాబుతో ముగిసిన ప్రధాని మోడీ భేటీ

    HYD: చంద్రబాబుతో ముగిసిన ప్రధాని మోడీ భేటీ. కాసేపట్లో చంద్రబాబు ఇంటి నుంచి బయల్దేరనున్న మోడీ.

  • 10 May 2026 06:11 PM (IST)

    కేరళలో కూడా మన కార్యకర్తలపై దాడులు జరిగాయి. -బండి సంజయ్‌

    శ్రీరామ్‌ నినాదంతోనే ఆ పార్టీని ఫామ్‌హౌస్‌కు పరిమితం చేశాం. మోడీ లేకుంటే తెలంగాణ ప్రభుత్వం నడవదు. తెలంగాణ నిధులను ఢిల్లీకి మోస్తున్నారు. బెంగాల్‌లో ఈజీగా గెలవలేదు. 300 మందికి పైగా కార్యకర్తలు బలిదానం చేశారు. కేరళలో కూడా మన కార్యకర్తలపై దాడులు జరిగాయి. -బండి సంజయ్‌

  • 10 May 2026 05:43 PM (IST)

    HYD: ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్న ప్రధాని మోడీ.

  • 10 May 2026 05:16 PM (IST)

    కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి ప్రధాని మోడీ

    HYD: పవన్‌ కల్యాణ్‌ నివాసంలో ప్రధాని మోడీ. పవన్‌ కల్యాణ్‌ను పరామర్శించిన ప్రధాని మోడీ. ఇటీవలే సర్జరీ చేయించుకున్న పవన్‌ కల్యాణ్‌. పవన్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ప్రధాని మోడీ. కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి ప్రధాని మోడీ.

  • 10 May 2026 04:53 PM (IST)

    పవన్‌ కల్యాణ్‌ ఇంటికి చేరుకున్న ప్రధాని మోడీ

    పవన్‌ కల్యాణ్‌ ఇంటికి చేరుకున్న ప్రధాని మోడీ. పవన్‌ కల్యాణ్‌ను పరామర్శించిన ప్రధాని మోడీ.

  • 10 May 2026 04:34 PM (IST)

    సీఎం రేవంత్ రెడ్డికి మోడీ కౌంటర్

    పదేళ్లలో గుజరాత్‌కు ఎన్ని నిధులు ఇచ్చామో తెలంగాణకు అంతే ఇచ్చేందుకు సిద్ధం. అలా చేస్తే మీకు సగం నిధులే వస్తాయి. అవి చాలా.? అభివృద్ధిలో మీరు ఎక్కడికి చేరాలనుకుంటున్నారో అక్కడికి చేరలేరు. మాతో కలిసి పనిచేయండి. అని ప్రధాని మోడీ కౌంటర్ ఇచ్చారు.

  • 10 May 2026 04:14 PM (IST)

    అలా చేస్తే మీకు సగం నిధులే వస్తాయి. -ప్రధాని మోడీ

    తెలంగాణకు 5 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఇచ్చాం. తెలంగాణకు 6 అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఇచ్చాం. తెలంగాణ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. రాజకీయాలు మాట్లాడనని రేవంత్‌ అన్నారు, నేను కూడా మాట్లాడను. పదేళ్లలో గుజరాత్‌కు ఎన్ని నిధులు ఇచ్చామో తెలంగాణకు అంతే ఇచ్చేందుకు సిద్ధం. అలా చేస్తే మీకు సగం నిధులే వస్తాయి. -ప్రధాని మోడీ

  • 10 May 2026 04:14 PM (IST)

    రేవంత్‌రెడ్డి నా మాట శ్రద్ధగా వినండి -ప్రధాని మోడీ

    తెలంగాణలో జాతీయ రహదారులు రెట్టింపు అయ్యాయి. రేవంత్‌రెడ్డి నా మాట శ్రద్ధగా వినండి. 2014 ముందు ఏపీకి వెయ్యి కోట్ల కంటే తక్కువ రైల్వే బడ్జెట్‌ ఉండేది. ఇప్పుడు బడ్జెట్లో తెలంగాణకే రూ.5,500 కోట్లు రైల్వే పనులకు కేటాయించాం. రూ.15 వేల కోట్ల రైల్వే పనులు జరుగుతున్నాయి. -ప్రధాని మోడీ

  • 10 May 2026 04:04 PM (IST)

    ఉద్యోగ అవకాశాలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. -ప్రధాని మోడీ

    సైబరాబాద్‌ సామర్థ్యం అంతర్జాతీయమైనది. దేశాభివృద్ధిలో నగరం కీలకపాత్ర పోషిస్తోంది. ఈ ప్రారంభోత్సవాలతో ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. వరంగల్‌ పీఎం మిత్ర పార్కు ద్వారా దేశంలో టెక్స్‌టైల్స్‌ రంగానికి ఊతమిస్తుంది. దేశంలో రోడ్లు, రైల్వేలు, ఎయిర్‌పోర్టుల కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తున్నాం. -ప్రధాని మోడీ

  • 10 May 2026 03:58 PM (IST)

    పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శ్రీకారం

    HICCలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శ్రీకారం. రూ.9,377 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. కాకతీయ టెక్స్‌టైల్స్‌ పార్క్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ. గుడెబల్లూర్-మహబూబ్‌నగర్‌ 4 లేన్ల రహదారి నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ.

  • 10 May 2026 03:53 PM (IST)

    పెండింగ్‌ ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వండి -సీఎం రేవంత్ రెడ్డి

    ఆరోజు మన్మోహన్‌ లాగా, ఇప్పుడు మీ సహకారం కావాలి. దేశంలో 6 నగరాలను గ్రోత్‌ ఇంజిన్‌లాగా అభివృద్ధి చేయండి. టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి సింగిల్‌ విండో ద్వారా అనుమతులు ఇవ్వండి. దేశం అభివృద్ధి చెందుతున్నంత వేగంగా తెలంగాణ అభివృద్ధి చెందాలనుకుంటుంది. అందుకు మీ సహకారం కావాలి. మచిలీపట్నం పోర్టు వదరకు వేగంగా రైల్వే లైన్‌ వేయండి. పెండింగ్‌ ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వండి. మోడీది పెద్దమనసని బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి అంటారు. తెలంగాణపై కూడా పెద్ద మనసు చూపించండి.-సీఎం రేవంత్‌

  • 10 May 2026 03:46 PM (IST)

    ఇది వికాస ఉత్సవం -సీఎం రేవంత్ రెడ్డి

    ఇది వికాస ఉత్సవం. తెలంగాణ అభివృద్ధికి ఎంతో కీలకం. 2047 పాలసీ డాక్యుమెంట్‌ రూపొందించాం. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లడానికి మోడీ వచ్చారు. 2047 నాటికి దేశ ఎకానమీని 30 ట్రిలియన్‌లకు చేర్చాలని ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారు. 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ దేశంలో 10 శాతం ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుంది. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ల ఎకానమీ చేరుకోవడమే మా లక్ష్యం. -సీఎం రేవంత్

  • 10 May 2026 03:39 PM (IST)

    తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పనిచేస్తోంది. -కిషన్‌ రెడ్డి

    తెలంగాణ ప్రజల తరుఫున ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్నా. 2014కు ముందు రోడ్లు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. ఒకేసారి తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నాం. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను ఎయిర్‌పోర్టులా మార్చుతున్నాం. త్వరలోనే రీజినల్‌ రింగు రోడ్డు పనులను ప్రారంభిస్తాం. గతంలో ప్రారంభోత్సవాలకు ప్రధాని వస్తే అప్పుడున్న సీఎం రాలేదు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పనిచేస్తోంది. -కిషన్‌ రెడ్డి

  • 10 May 2026 03:35 PM (IST)

    ప్రధాని మోడీకి స్వాగతం పలికిన గవర్నర్‌ శుక్లా, సీఎం రేవంత్‌

    హైదరాబాద్‌: HICCలో ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధాని మోడీకి స్వాగతం పలికిన గవర్నర్‌ శుక్లా, సీఎం రేవంత్‌. ప్రధాని మోడీని శాలువాతో సత్కరించిన సీఎం రేవంత్‌ రెడ్డి. రూ.9,377 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు.

  • 10 May 2026 03:15 PM (IST)

    మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీకి చేరుకున్న ప్రధాని

    మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీకి చేరుకున్న ప్రధాని.. వర్చువల్ విధానంలో రూ. 9,400 కోట్ల విలువైన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు కొత్తగా నిర్మించిన సింధు ఆసుపత్రిని ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ

  • 10 May 2026 03:12 PM (IST)

    మోడీ సభకు భారీ బందోబస్తు

    హైదరాబాద్‌: ప్రధాని మోడీ సభకు భారీ బందోబస్తు ఏర్పాట్లు.. సుమారు లక్ష మంది హాజరవుతారన్న అంచనాతో భద్రతా చర్యలు.. 2 వేల మందికి పైగా పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు.. జాయింట్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా రియల్‌ టైమ్‌ మానిటరింగ్.. ప్రవేశ ద్వారాల వద్ద అధునాతన స్కానర్లు ఏర్పాటు.. హెల్మెట్లు, లైటర్లు, మ్యాచ్‌ బాక్స్‌లు, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌లకు అనుమతి నిరాకరణ

  • 10 May 2026 03:04 PM (IST)

    మోడీకి ఘనస్వాగతం

    షెడ్యూల్ కంటే 30 నిమిషాలు ఆలస్యంగా బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన ప్రధాని మోడీ. మోడీకి రాష్ట్ర నాయకులు, బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

  • 10 May 2026 02:59 PM (IST)

    బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ.

    బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ.. స్వాగతం పలికిన నేతలు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. బేగంపేట్‌ నుంచి HICCకి వెళ్లనున్న మోడీ.. రూ.9,377 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు..

  • 10 May 2026 02:49 PM (IST)

    కాసేపట్లో హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోడీ

    కాసేపట్లో హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోడీ.. బేగంపేట్‌ ఎయిర్‌పోర్టులో స్వాగతం పలకనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. HICCలో జరిగే అభివృద్ధి పనుల్లో పాల్గొననున్న ప్రధాని మోడీ.. రూ.9,377 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు.. కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి ఆహ్వానం